'ఉత్తమ విలన్' విడుదలపై తొలగని సందిగ్థత | Uttama villain movie release delayed | Sakshi
Sakshi News home page

'ఉత్తమ విలన్' విడుదలపై తొలగని సందిగ్థత

May 2 2015 11:26 AM | Updated on Sep 19 2019 9:06 PM

'ఉత్తమ విలన్' విడుదలపై తొలగని సందిగ్థత - Sakshi

'ఉత్తమ విలన్' విడుదలపై తొలగని సందిగ్థత

ప్రముఖ నటుడు కమల్ హసన్ నటించిన 'ఉత్తమ విలన్' చిత్రం విడుదలపై ఇంకా సందిగ్థత తొలగలేదు. శనివారం ఈ చిత్రం విడుదల అవుతుందని అన్నారు.

హైదరాబాద్: ప్రముఖ నటుడు కమల్ హసన్ నటించిన 'ఉత్తమ విలన్' చిత్రం విడుదలపై ఇంకా సందిగ్థత తొలగలేదు. శనివారం ఈ చిత్రం విడుదల అవుతుందని అన్నారు. కానీ ఇంకా విడుదల కాలేదు. ఈ రోజు మ్యాట్నీ సమయానికి ఉత్తమ విలన్ విడుదల చేస్తామని నిర్మాతలు చెబుతున్నారు.

తన వద్ద తీసుకున్న అప్పును చెల్లించకుండా 'ఉత్తమ విలన్' చిత్రం విడుదల చేసేందుకు వీల్లేకుండా ఆదేశాలు జారీచేయాలని కోరుతూ  చెన్నై వలసరవాక్కంకు చెందిన తంగరాజ్ మద్రాసు హైకోర్టులో గత నెల పిటిషన్ దాఖలు చేశాడు. దీంతో ఈ చిత్రం విడుదల బ్రేకు పడింది.

ఉత్తమ విలన్ చిత్రం ఆది నుంచి వివాదాల మయమైంది. ఈ సినిమాలో కమల్ విచిత్ర వేషధారణ ఒక హాలీవుడ్ చిత్రం నుంచి కాపీ కొట్టారని ఫొటోలు సహా ప్రచురితమైనాయి. పుదియ తమిళగం కట్చి అధ్యక్షులు కృష్ణస్వామి సినిమాపై పలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. హిందూ దేవుళ్లను చిత్రంలో కించపరిచారంటూ కొన్ని హిందూ సంస్థల కార్యకర్తలు కమల్ ఫొటోలను తగులబెట్టి ఆందోళన నిర్వహించారు.  అయితే వీటన్నింటినీ అధిగమించి ఉత్తమ విలన్ విడుదలకు సిద్ధమైనా అప్పు వ్యవహారంతో బ్రేక్ పడింది. అయితే కమల్ హసన్ ఉత్తమ్ విలన్ ఎప్పుడు విడుదల అవుతందా అని ఆయన అభిమానులు ఎదురు చూస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement