కౌగలించుకోడానికి నిరాకరించాడన్న కోపంతో.. అమెరికాలో ఓ మహిళ తన బోయ్ఫ్రెండును కత్తితో పొడిచేసింది!!
కౌగలించుకోడానికి నిరాకరించాడన్న కోపంతో.. అమెరికాలో ఓ మహిళ తన బోయ్ఫ్రెండును కత్తితో పొడిచేసింది!! దాంతో పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. ఫ్లోరిడాలోని మనాటీలోని తమ నివాసంలో షవోనా రంఫ్, ఆమె బోయ్ఫ్రెండు కలిసి మద్యం తాగుతున్నారు. కాసేపటి తర్వాత ఇద్దరూ పడుకున్నారు. కానీ ఆమెను కౌగలించుకోడానికి అతడు నిరాకరించాడు.
దాంతో వారిద్దరి మధ్య గొడవ మొదలైంది. బోయ్ఫ్రెండు షర్టును రంఫ్ లాగేసింది. దాంతో అది కాస్తా చిరిగిపోయింది. చివరకు ఆమె వంటింట్లో ఉపయోగించే కత్తి తీసుకుని అతగాడిని పొడిచేసింది. అతడు పారిపోవడానికి కూడా ఓ దశలో ప్రయత్నించాడు. ఈ సంఘటనతో రంఫ్ను అరెస్టు చేసినట్లు మాంటీ ప్రాంత పోలీసు కార్యాలయం తెలిపింది. ఆ తర్వాత 250 డాలర్ల బాండు సమర్పించడంతో విడుదల చేశారు.