breaking news
lady arrested
-
భర్త మగాడు అనుకుని మోసపోయింది!
జకర్తా: ఓ ఇండోనేషియా అమ్మాయి కొన్ని నెలల నుంచి బాయ్ ఫ్రెండ్‌తో డేటింగ్ చేసింది. ఇటీవలే ప్రియుడిని వివాహం చేసుకుంది. అయితే తన భర్త మగాడు అని భావించి మోసపోయింది. ఆ ట్విస్ట్ ఏంటో తెలుసుకోవాలని ఉందా.. ఈ వివరాలపై ఓ లుక్కేయండి. హెనియాతీ(25) అనే ఇండోనేషియా యువతికి మహమ్మద్ ఈఫెండీ సపుత్రా (అసలు పేరు సువార్తీ) అనే యువకుడు పరిచమయ్యాడు. వారి పరిచయం ప్రేమగా మారింది. ఏడు నెలల తర్వాత వీరిద్దరూ జావా దీవులలో పెళ్లి చేసుకున్నారు. వివాహం జరిగిన కొన్ని రోజులైనా భర్త తనను దూరంగా ఉంచడంతో ఆమెకు అనుమానం వచ్చింది. సపుత్రా ప్రతిరోజూ ఏదో ఒక సాకు చెప్పి తప్పించుకునేవాడు. ఈ విషయంలో అనుమానం వచ్చిన భార్య హెనియాతీ పోలీసులను ఆశ్రయించింది. పోలీసుల విచారణలో దిమ్మతిరిగే నిజాలు బయటపడ్డాయి. అసలు మహ్మద్ సపుత్రా అనే వ్యక్తి పురుషుడే కాదని, స్త్రీ అని ఆమె పేరు సువార్తీ అని పోలీసులు తెలిపారు. 40 ఏళ్ల సువార్తీకి ఇదివరకే ఓ వ్యక్తితో పెళ్లయి 17 ఏళ్ల కొడుకు కరిరి ఉన్నట్లు కొత్త పెళ్లికూతురు హెనియాతీకి వివరించారు. ఒకరోజు సువార్తీ పర్స్ చూసిన తర్వాత అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు వెల్లడించింది. తనకు కొంచెం కూడా అనుమానం రాకుండా మగవాడిలా నటించి తనను పెళ్లి చేసుకుందని ఫిర్యాదులో పేర్కొంది. నవ వధువు హెనియాతీతో పాటు ఆమె పేరెంట్స్, బంధువులు సువార్తీ చేసిన పని వల్ల షాక్ తిన్నట్లు వివరించారు. సువార్తీకి దాదాపు ఏడేళ్ల జైలు శిక్ష పడే అవకాశాలున్నాయని ఇండోనేషియా అధికారులు తెలిపారు. -
కౌగలించుకోలేదని బోయ్‌ఫ్రెండును పొడిచేసింది!
కౌగలించుకోడానికి నిరాకరించాడన్న కోపంతో.. అమెరికాలో ఓ మహిళ తన బోయ్‌ఫ్రెండును కత్తితో పొడిచేసింది!! దాంతో పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. ఫ్లోరిడాలోని మనాటీలోని తమ నివాసంలో షవోనా రంఫ్, ఆమె బోయ్‌ఫ్రెండు కలిసి మద్యం తాగుతున్నారు. కాసేపటి తర్వాత ఇద్దరూ పడుకున్నారు. కానీ ఆమెను కౌగలించుకోడానికి అతడు నిరాకరించాడు. దాంతో వారిద్దరి మధ్య గొడవ మొదలైంది. బోయ్‌ఫ్రెండు షర్టును రంఫ్ లాగేసింది. దాంతో అది కాస్తా చిరిగిపోయింది. చివరకు ఆమె వంటింట్లో ఉపయోగించే కత్తి తీసుకుని అతగాడిని పొడిచేసింది. అతడు పారిపోవడానికి కూడా ఓ దశలో ప్రయత్నించాడు. ఈ సంఘటనతో రంఫ్ను అరెస్టు చేసినట్లు మాంటీ ప్రాంత పోలీసు కార్యాలయం తెలిపింది. ఆ తర్వాత 250 డాలర్ల బాండు సమర్పించడంతో విడుదల చేశారు.