మోదీ గ్రేట్ | Union Minister Venkaiah Naidu Appreciated to modi | Sakshi
Sakshi News home page

మోదీ గ్రేట్

Jun 23 2015 5:29 AM | Updated on Aug 21 2018 9:33 PM

మోదీ గ్రేట్ - Sakshi

మోదీ గ్రేట్

తొలి అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఆదివారం దేశంలో ముందుండి ఘనంగా నిర్వహించిన ప్రధాని నరేంద్ర మోదీని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ప్రశంసలతో

భారత్‌ను ఆధ్యాత్మిక రాజధానిని చేశారు: వెంకయ్య
న్యూఢిల్లీ: తొలి అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఆదివారం దేశంలో ముందుండి ఘనంగా నిర్వహించిన ప్రధాని నరేంద్ర మోదీని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ప్రశంసలతో ముంచెత్తారు. ‘మోదీ గొప్పవ్యక్తి. భారత్‌ను ఆధ్యాత్మిక రాజధానిని చేశారు. ఐక్యరాజ్యసమితిలోని 193 సభ్యదేశాలు యోగా డే జరుపుకున్నాయి. ఇది నిజంగా ప్రపంచ ఏకీకరణే’ అని సోమవారం ట్విటర్‌లో కొనియాడారు.

మోదీ భారత్‌ను ప్రతి అంశంలో మార్చేస్తున్నారంటూ స్వచ్ఛభారత్, బేటీ పడావో  బేటీ బచావో తదితరాలను ప్రస్తావించారు. రాష్ట్రపతి భవన్‌లో యోగా డేను నిర్వహించి దేశానికి మార్గదర్శకత్వం వహించారంటూ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీపైనా ప్రశంసల వర్షం కురిపించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement