డ్యాన్స్ చేయడానికి లేమిక్కడ | Union Minister Sujana Chowdary press meet in Delhi | Sakshi
Sakshi News home page

డ్యాన్స్ చేయడానికి లేమిక్కడ

Sep 26 2015 2:38 AM | Updated on Sep 3 2017 9:58 AM

డ్యాన్స్ చేయడానికి లేమిక్కడ

డ్యాన్స్ చేయడానికి లేమిక్కడ

తాము అధికారంలో ఉన్నది విపక్షం డెరైక్షన్‌లో డ్యాన్స్‌లు చేయడానికి కాదని కేంద్రమంత్రి సుజనా చౌదరి వ్యాఖ్యానించారు.

కేంద్రమంత్రి సుజనా చౌదరి వ్యాఖ్య
సాక్షి, న్యూఢిల్లీ: తాము అధికారంలో ఉన్నది విపక్షం డెరైక్షన్‌లో డ్యాన్స్‌లు చేయడానికి కాదని కేంద్రమంత్రి సుజనా చౌదరి వ్యాఖ్యానించారు. విపక్షం చెప్పినట్టు నడుచుకోవడానికి ప్రజలు తీర్పు ఇవ్వలేదని, ప్రజాతీర్పు మేరకు ఐదేళ్లు నడుచుకోవాలన్నారు. ఏపీకి ప్రత్యేకహోదా డిమాండ్ విషయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పోరాటంపై స్పందిస్తూ కేంద్రమంత్రి ఢిల్లీలో శుక్రవారం ఇలా మాట్లాడారు. రాష్ట్ర విభజన చట్టంలోని అంశాలతో పాటు చట్టంలోలేని వాటిని సాధించడానికి ప్రభుత్వం కృషి చేస్తుండగా, విపక్ష పార్టీ స్కూల్లో అల్లరి పిల్లల్లా వ్యవహరిస్తోందన్నారు.షెడ్యూల్ 9, 10 లోని ఆస్తుల విషయాన్ని వచ్చే నెల 15వ తేదీ లోపు ఒక కొలిక్కి తెస్తామన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement