
'ఏయ్.. ఏదో ఒకటి చేయండయ్యా'
శివసేన పార్టీ అధినేత ఉద్దవ్ ఠాక్రే తన పార్టీ మంత్రులపై రుసరుసలాడారు. ప్రజలకోసం ఏదో ఒక మంచి చేయండి అంటూ కసురుకున్నారు.
ముంబయి: శివసేన పార్టీ అధినేత ఉద్దవ్ ఠాక్రే తన పార్టీ మంత్రులపై రుసరుసలాడారు. ప్రజలకోసం ఏదో ఒక మంచి చేయండి అంటూ కసురుకున్నారు. రాష్ట్రంలో తాగునీటి సమస్యతో ప్రజలు అల్లాడుతుంటే ఎందుకు పట్టించుకోవడం లేదని ఆయన మంత్రులపై మండిపడ్డారు.
పలు కరువు ప్రాంతాల్లో తిరిగిన ఆయన అక్కడి పరిస్థితిని చూసి చలించిపోయారని, మరఠ్వాడా ప్రాంతంలో తాగునీటి కోసం ప్రజలు పడుతున్న ఇబ్బందిని చూసి సంబంధిత మంత్రులను తన స్వగృహం మాతోశ్రీకి పిలిపించుకొని మరి ఆగ్రహం వ్యక్తం చేశారని శివసేన పార్టీ సీనియర్ నాయకుడు తెలిపారు. వెంటనే శివ్ జల్ క్రాంతి యోజన పథకాన్ని వెంటనే నీటి కరువు ఉన్న మరఠ్వాడా ప్రాంతంలో అమలుచేయాలని ఆదేశించారు. ఇదే నెలలోని రెండో వారంలో అవే కరువు ప్రాంతాల్లో తాను మరోసారి పర్యటిస్తానని అప్పటిలోగా సమస్య కనిపించకుండా చేయాలని వారికి స్పష్టం చేశారు.