ఉగ్రవాదిని పట్టుకున్న బీఎస్ఎఫ్ | udampur attack: terrorist caught alive | Sakshi
Sakshi News home page

ఉగ్రవాదిని పట్టుకున్న బీఎస్ఎఫ్

Aug 5 2015 12:56 PM | Updated on Sep 3 2017 6:50 AM

ఉగ్రవాదిని పట్టుకున్న బీఎస్ఎఫ్

ఉగ్రవాదిని పట్టుకున్న బీఎస్ఎఫ్

జమ్మూకాశ్మీర్లో ఉదంపూర్ ఉగ్రవాద దాడి ఘటనలో సరిహద్దు భద్రత దళం (బీఎస్ఎఫ్) ఓ ఉగ్రవాదిని సజీవంగా పట్టుకుంది.

న్యూఢిల్లీ: జమ్మూకాశ్మీర్లో ఉదంపూర్ ఉగ్రవాద దాడి ఘటనలో సరిహద్దు భద్రత దళం (బీఎస్ఎఫ్), ఆర్మీ  ఓ ఉగ్రవాదిని సజీవంగా పట్టుకుంది. బీఎస్ఎఫ్ తో పాటు ఆర్మీ రంగంలోకి దిగి ఉగ్రవాదుల వద్ద బందీలుగా ఉన్న ముగ్గురిని రక్షించారు.

ఈ రోజు ఉదయం ఉదంపూర్ సమీపంలో జమ్ము-శ్రీనగర్ హైవేపై వెళ్తున్న బీఎస్ఎఫ్ కాన్వాయ్పై ఉగ్రవాదులు దాడి చేసి కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఇద్దరు బీఎస్ఎఫ్ జవాన్లు మరణించగా, మరో ఎనిమిది మంది గాయపడ్డారు. దాడి నేపథ్యంలో భద్రత చర్యలను పర్యవేక్షించేందుకు బీఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్ డీకే పాఠక్ జమ్మూకు వెళ్లారు.  పాఠక్ ఉదంపూర్ వెళ్లనున్నట్టు అధికారులు చెప్పారు.  ఆయన అమర్నాథ్ యాత్ర భద్రత ఏర్పాట్లను సమీక్షించనున్నట్టు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement