అమెరికా పాఠశాలలో కాల్పులు.. ఇద్దరి మృతి | Two killed in US school shooting | Sakshi
Sakshi News home page

అమెరికా పాఠశాలలో కాల్పులు.. ఇద్దరి మృతి

Oct 22 2013 1:08 PM | Updated on Apr 4 2019 5:12 PM

అమెరికాలో గన్ కల్చర్ ఏమాత్రం తగ్గలేదు. తాజాగా నెవెడా రాష్ట్రంలో ఓ పాఠశాలలో జరిగిన కాల్పులలో ఓ ఉపాధ్యాయిని సహా ఇద్దరు మరణించారు.

అమెరికాలో గన్ కల్చర్ ఏమాత్రం తగ్గలేదు. తాజాగా నెవెడా రాష్ట్రంలో ఓ పాఠశాలలో జరిగిన కాల్పులలో ఓ ఉపాధ్యాయిని సహా ఇద్దరు మరణించారు. స్పార్క్ మిడిల్ స్కూల్లో ఈ సంఘటన జరిగిందని, ఇందులో ఓ ఉపాధ్యాయిని మరణించగా, మరొకరు నిందితుడు గానీ విద్యార్థి గానీ కావొచ్చని సిన్హువా వార్తా సంస్థ ప్రకటించింది. కాల్పులలో మరణించిన ఉపాధ్యాయిని తమ పాఠశాలలో బాగా పేరొందిన లెక్కల టీచర్ అని విద్యార్థులు తెలిపారు.

భారత కాలమానం ప్రకారం సోమవారం రాత్రి తరగతులు ప్రారంభమైన తర్వాత కాల్పులు జరిగాయి. నెవెడాలోని రెనో ప్రాంతంలో గల స్పార్క్స్ మిడిల్ స్కూల్ ఈ దారుణ సంఘటనకు మౌనసాక్షిగా మిగిలింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement