ఉగ్రవాదుల గ్రెనేడ్ దాడి: ఐదుగురికి గాయాలు | Two CRPF Jawans Injured in grenade attack in antnag and pahalgam Highway | Sakshi
Sakshi News home page

ఉగ్రవాదుల గ్రెనేడ్ దాడి: ఐదుగురికి గాయాలు

Jul 29 2015 1:16 PM | Updated on Aug 11 2018 9:02 PM

దక్షిణ కాశ్మీర్ అనంతనాగ్ జిల్లాలో ఉగ్రవాదులు బుధవారం రెచ్చిపోయారు.

జమ్మూకాశ్మీర్: దక్షిణ కాశ్మీర్ అనంతనాగ్ జిల్లాలో ఉగ్రవాదులు బుధవారం రెచ్చిపోయారు. అనంతనాగ్ జిల్లాలోని క్వాజీ బజార్లో పహారాలో ఉన్న సీఆర్పీఎఫ్ జవాన్లపై గ్రెనేడ్ దాడి చేశారు. ఈ దాడిలో ఐదుగురు గాయపడ్డారని పోలీసులు తెలిపారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు. గాయపడిన వారిలో ముగ్గురు సీఆర్పీఎఫ్ జవాన్లతోపాటు ఇద్దరు పౌరులు ఉన్నారని వెల్లడించారు. అయితే దాడి చేసిన ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు.  

Advertisement
 
Advertisement
Advertisement