అగ్రరాజ్యానికి టర్కీ వార్నింగ్‌ | turkey woring to russia | Sakshi
Sakshi News home page

అగ్రరాజ్యానికి టర్కీ వార్నింగ్‌

Mar 23 2017 5:05 PM | Updated on Sep 5 2018 9:47 PM

టర్కీ జవాన్లపై సిరియా సరిహద్దుల్లో జరిగిన కాల్పులకు ఆ దేశ ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది.

అంకారా(టర్కీ): టర్కీ జవాన్లపై సిరియా సరిహద్దుల్లో జరిగిన కాల్పులకు ఆ దేశ ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. మరోసారి ఇలా జరిగితే ఊరుకోబోమని అగ్రరాజ్యం రష్యాను హెచ్చరించింది. సిరియా, టర్కీ సరిహద్దుల్లోని కుర్దుల ప్రాబల్యంలో ఉన్న ప్రాంతం నుంచి జరిగిన కాల్పుల్లో ఓ టర్కీ జవాను మృతిచెందాడు. దీనిపై టర్కీలోని రష్యా రాయబారిని పిలిపించుకుని హెచ్చరికలు జారీ చేసింది. సిరియాలో ప్రభుత్వం, తీవ్రవాద, ప్రభుత్వ వ్యతిరేక పక్షాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందాన్ని రష్యానే పర్యవేక్షిస్తోందని, ఈ నేపథ్యంలోనే కాల్పులు జరిగాయని టర్కీ ఆరోపించింది. సిరియాలోని కుర్దుల ఆధీనంలోని ప్రాంతాల్లో రష్యా బలగాలు ఉండటం పట్ల ఆగ్రహం వ్యక్తం చేసింది. స్వతంత్రం కోసం పోరాడుతున్న కుర్దులు రష్యా రాజధాని మాస్కోలో ఏర్పాటు చేసిన కార్యాలయాన్ని మూసివేయాలని కోరింది.

Advertisement
 
Advertisement
Advertisement