సిరియాలో టర్కీ దాడులు | Turkey attacks in Syria | Sakshi
Sakshi News home page

సిరియాలో టర్కీ దాడులు

Dec 24 2016 1:51 AM | Updated on Sep 4 2017 11:26 PM

సిరియాలో టర్కీ దాడులు

సిరియాలో టర్కీ దాడులు

ఐసిస్‌ ఉగ్రవాదుల చెరలో ఉన్న సిరియా పట్టణం అల్‌ బాబ్‌పై టర్కీ దళాలు 24 గంటలు పాటు జరిపిన విమాన

88 మంది పౌరుల మృతి

బీరుట్‌/అలెప్పో: ఐసిస్‌ ఉగ్రవాదుల చెరలో ఉన్న సిరియా పట్టణం అల్‌ బాబ్‌పై టర్కీ దళాలు 24 గంటలు పాటు జరిపిన విమాన దాడుల్లో 88 మంది సాధారణ పౌరులు మృత్యువాత పడ్డారు. గురువారం నాటి దాడుల్లో 72 మంది మృతి చెందగా.. శుక్రవారం కూడా కొనసాగిన ఆ దాడుల్లో మరో 16 మంది చనిపోయారని మానవ హక్కుల సంఘం ప్రకటించింది. ఆగస్టు నుంచి మొదలైన టర్కీ దాడుల్లో ఇదే అతిదారుణమైనదని  పేర్కొంది.

తమ జవాన్లను చంపిన ఐసిస్‌పై ప్రతీకారం తీర్చుకుంటామని టర్కీ ప్రకటించిన తర్వాత.. గురువారం ఆ ఉగ్రసంస్థ మరో ఇద్దరు టర్కీ జవానులను సజీవంగా తగలబెట్టిన వీడియో ఒకటి విడుదల చేసింది.సిరియా దళాల చేతుల్లోకి అలెప్పో..రెబెల్స్‌కు కీలకమైన పట్టణంగా ఉన్న అలెప్పోపై సిరియా దళాలు పూర్తి పట్టు సాధించాయి. ప్రజలు కూడా తమ ఇళ్లకు తిరిగి వచ్చి శిథిలమైన వాటిని గుర్తిస్తున్నారు. సివిల్‌ వార్‌ మొదలైన తర్వాత అధ్యక్షుడు బషర్‌ అల్‌ అసద్‌కు ఇదే అతిపెద్ద విజయం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement