ట్రంప్‌ టవర్‌లో బ్యాగ్‌ కలకలం | Trump Tower lobby evacuation prompted by bag of toys | Sakshi
Sakshi News home page

ట్రంప్‌ టవర్‌లో బ్యాగ్‌ కలకలం

Dec 29 2016 3:05 AM | Updated on Aug 25 2018 7:50 PM

ట్రంప్‌ టవర్‌లో బ్యాగ్‌ కలకలం - Sakshi

ట్రంప్‌ టవర్‌లో బ్యాగ్‌ కలకలం

అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్‌ ట్రంప్‌కు చెందిన 58 అంతస్తుల భవంతి (ట్రంప్‌ టవర్‌)లో ఒక అనుమానాస్పద బ్యాగ్‌ కలకలం రేపింది. న్యూయార్క్‌ లోని ఈ భారీ భవంతి లాబీ

న్యూయార్క్‌: అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్‌ ట్రంప్‌కు చెందిన 58 అంతస్తుల భవంతి (ట్రంప్‌ టవర్‌)లో ఒక అనుమానాస్పద బ్యాగ్‌ కలకలం రేపింది. న్యూయార్క్‌ లోని ఈ భారీ భవంతి లాబీలో బుధవారం ఆ బ్యాగ్‌ కనుగొన్నతర్వాత.. హుటాహుటిన భవంతిని ఖాళీ చేయించారు. ఆ బ్యాగ్‌లో ఆటబొమ్మలు మాత్రమే ఉన్నాయని బాంబు నిర్వీర్య సిబ్బంది తేల్చడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. తన కుటుంబంతో కలసి వచ్చిన ఒక బాలుడు ఆ బ్యాగ్‌ వదిలివెళ్లినట్లు సీసీ కెమెరాల ద్వారా తెలిసింది. దీనిపై ట్రంప్‌ స్పందిస్తూ.. అనుమానాస్పద బ్యాగ్‌తో ఏర్పడ్డ కలకలం సర్దుకుంది అని ట్వీట్‌ చేశారు. ప్రస్తుతం ట్రంప్‌ ఫ్లోరిడాలో ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement