ఏడు పెద్ద బ్యాంకుల నుంచి అవాంఛిత కాల్స్ | TRAI cautions seven major banks on pesky calls | Sakshi
Sakshi News home page

ఏడు పెద్ద బ్యాంకుల నుంచి అవాంఛిత కాల్స్

Sep 24 2013 3:02 AM | Updated on Sep 1 2017 10:59 PM

ఎస్‌బీఐ, ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులతో సహా మొత్తం ఏడు బ్యాంకులు అవాం ఛిత కాల్స్ చేస్తున్నాయని ఫిర్యాదులొచ్చాయని టెలికాం నియంత్రణ సంస్థ, ట్రాయ్ సోమవారం తెలిపింది.

న్యూఢిల్లీ: ఎస్‌బీఐ, ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులతో సహా మొత్తం ఏడు బ్యాంకులు అవాం ఛిత కాల్స్ చేస్తున్నాయని ఫిర్యాదులొచ్చాయని టెలికాం నియంత్రణ సంస్థ, ట్రాయ్ సోమవారం తెలిపింది. ఈ విషయమై వారం రోజుల్లో సరైన వివరణ ఇవ్వకుంటే ఆయా బ్యాంకుల టెలిఫోన్  కనెక్షన్‌లను డిస్‌కనెక్ట్ చేస్తామని హెచ్చరించింది. ఎస్‌బీఐ, ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులతో పాటు పంజాబ్ నేషనల్ బ్యాంక్, సిటీ, యాక్సిస్, కోటక్ మహీంద్రా బ్యాంకులు కూడా ఈ జాబితాలో ఉన్నాయని వివరించింది. ఈ బ్యాంకులన్నీ నమోదు కాని టెలిమార్కెటీర్స్ నంబర్ల ద్వారా తమ సర్వీసులు, స్కీమ్‌ల గురించి ప్రచారం చేస్తున్నాయని వివరించింది. అవాంఛిత కాల్స్‌పై గత నెలలో కఠిన నిబంధనలను ట్రాయ్ జారీ చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement