ఒకటి కాదు.. రెండు కాదు.. 24 కిలోల హెరాయిన్. దాని విలువ రూ. 120 కోట్లు.
ఒకటి కాదు.. రెండు కాదు.. 24 కిలోల హెరాయిన్. దాని విలువ రూ. 120 కోట్లు. ఇంత హెరాయిన్ను పాకిస్థానీ స్మగ్లర్లు భారతదేశంలోకి తరలిస్తుండగా బీఎస్ఎఫ్ జవాన్లు గుర్తించి వారిని కాల్చిచంపారు. ముల్లాపూర్ గ్రామం వద్ద పెట్రోలింగ్ చేస్తున్న బీఎస్ఎఫ్ దళాలపై వారు కాల్పులు జరపడంతో జవాన్లు తిప్పికొట్టగా ముగ్గురు స్మగ్లర్లు చనిపోయారు.
తెల్లవారిన తర్వాత మృతదేహాల వద్ద గాలించగా, వారివద్ద రూ. 120 కోట్ల విలువైన 24 కేజీల హెరాయన్ దొరికింది. దీంతోపాటు కొన్ని ఆయుధాలు, మందుగుండు కూడా స్వాధీనం చేసుకున్నారు. గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని, మరిన్ని ఆయుధాలు, మరింత మొత్తంలో డ్రగ్స్ దొరికే అవకాశం ఉందని ఓ సీనియర్ అధికారి తెలిపారు.