మూడు రోజుల్లో ‘బాహుబలి’కి రూ.160 కోట్లు | Three days 'Bahubali' of the Rs 160 crore | Sakshi
Sakshi News home page

మూడు రోజుల్లో ‘బాహుబలి’కి రూ.160 కోట్లు

Jul 14 2015 8:36 AM | Updated on Jul 14 2019 4:18 PM

మూడు రోజుల్లో ‘బాహుబలి’కి రూ.160 కోట్లు - Sakshi

మూడు రోజుల్లో ‘బాహుబలి’కి రూ.160 కోట్లు

బాహుబలి చిత్రం విడుదలైన మూడురోజుల్లోనే రూ.160 కోట్లు వసూలు చేసి జాతీయ రికార్డు సృష్టించిందని చిత్ర దర్శకుడు

బళ్లారి: బాహుబలి చిత్రం విడుదలైన మూడురోజుల్లోనే రూ.160 కోట్లు వసూలు చేసి జాతీయ రికార్డు సృష్టించిందని చిత్ర దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి వెల్లడించారు. ఇదంతా ప్రేక్షక దేవుళ్లు చూపిన అభిమానంతోనే సాధ్యమైందన్నారు. సోమవారంరాత్రి నగరంలోని రాధిక థియేటర్‌లో సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి, నిర్మాత సాయి కొర్రపాటిలతో కలిసి చిత్రాన్ని వీక్షించిన అనంతరం విలేకరులతో మాట్లాడారు.

చిత్రం విడుదలైన తర్వాత ప్రేక్షుకుల నుంచి ఎలాంటి స్పందన వస్తుందోనని టెన్షన్‌గా ఉండేదని, ఇప్పుడదంతా పోయిందని పేర్కొన్నారు. బాహుబలి రెండో పార్ట్ షూటింగ్ 50 శాతం పూర్తయిందని, త్వరలో మిగతా భాగం పూర్తి చేసి ఏడాదిలోపు విడుదల చేస్తామన్నారు.
 
 

Advertisement
 
Advertisement
Advertisement