మంచిరోజులకు ఇంతకన్నా ప్రూఫ్‌ కావాలా? | this is the proof for achhe din | Sakshi
Sakshi News home page

మంచిరోజులకు ఇంతకన్నా ప్రూఫ్‌ కావాలా?

Nov 15 2016 3:54 PM | Updated on Sep 4 2017 8:10 PM

మంచిరోజులకు ఇంతకన్నా ప్రూఫ్‌ కావాలా?

మంచిరోజులకు ఇంతకన్నా ప్రూఫ్‌ కావాలా?

ప్రధానమంత్రి నరేంద్రమోదీ తాను అధికారంలోకి వస్తే ప్రజలకు మంచి రోజులు వస్తాయని హామీ ఇచ్చారు.

ప్రధానమంత్రి నరేంద్రమోదీ తాను అధికారంలోకి వస్తే ప్రజలకు మంచి రోజులు వస్తాయని హామీ ఇచ్చారు. కానీ, పెద్దనోట్ల రద్దుతో బ్యాంకులు ముష్టివేసే డబ్బుల కోసం ప్రజలు పడిగాపులు పడుతున్నారు. మంచిరోజులకు ఇంతకన్నా రుజువు ఏం కావాలి’అంటూ కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్‌ నేత, మాజీ కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం విమర్శించారు.

పెద్దనోట్ల రద్దును సక్రమంగా మోదీ ప్రభుత్వం అమలుచేయకపోవడాన్ని తప్పుబడుతూ చిదంబరం వరుస ట్వీట్లతో సెటైర్లు గుప్పించారు. ‘లక్షలాది మంది క్యూలలో నిల్చున్నారు. ఉత్పత్తి జిందాబాద్‌’ అంటూ ట్వీట్‌ చేశారు. పెద్దనోట్ల రద్దుతో పేదలు కంటినిండా నిద్రపోతున్నారని, ధనికులే నిద్రమాత్రలు మింగుతున్నారని మోదీ చేసిన వ్యాఖ్యలను ఎద్దేవా చేస్తూ.. ‘చూడండి వేలాదిమంది ‘ధనికులు’, ‘అవినీతిపరులు’​ క్యూలో నిలుచున్నారు. పేదలు తమ ఇళ్ల నుంచి వారిని చూస్తూ ఆనందిస్తున్నారు’ అని పేర్కొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement