అందమైన అమ్మాయి.. ఫ్రెండ్‌గా ఉండమంటే! | This girl asked unknown boys on Delhi streets to be friends with her | Sakshi
Sakshi News home page

అందమైన అమ్మాయి.. ఫ్రెండ్‌గా ఉండమంటే!

Aug 8 2016 4:44 PM | Updated on Sep 4 2017 8:25 AM

అందమైన అమ్మాయి..  ఫ్రెండ్‌గా ఉండమంటే!

అందమైన అమ్మాయి.. ఫ్రెండ్‌గా ఉండమంటే!

ఒక అందమైన అమ్మాయి ఎదురుపడి.. 'నాకు స్నేహితులెవరూ లేరు. మీరు నా ఫ్రెండ్‌గా ఉంటారా?' అని అడిగితే ఎవరు మాత్రం ఒప్పుకోరు.

ఒక అందమైన అమ్మాయి ఎదురుపడి.. 'నాకు స్నేహితులెవరూ లేరు. మీరు నా ఫ్రెండ్‌గా ఉంటారా?' అని అడిగితే ఎవరు మాత్రం ఒప్పుకోరు. ఎగిరి గంతేసి ఓకే చెప్తారు కదా? అదే జరిగింది గత ఆదివారం న్యూఢిల్లీలో.. ఓ అందమైన అమ్మాయి ఇలా చాలామందిని 'తన ఫ్రెండ్‌గా' ఉండమని కోరింది. చాలామంది హ్యాపీగా ఒప్పుకొన్నారు కూడా.. మరీ ఆదివారం ఫ్రెండ్‌షిప్‌ డే కదా.. అందుకే ఆమె వారికి ఫ్రెండ్‌షిప్‌ బ్యాండ్‌ కట్టింది. ఈ బ్యాండ్‌ కట్టిన తర్వాత ఆ బ్యూటీ ట్విస్టు ఇచ్చింది. 'ఫ్రెండ్‌షిప్‌ ఫ్రీ కానీ.. బ్యాండ్‌ ఫ్రీ కాదు.. కాబట్టి రూ. 40 కట్టండి' అంటూ గట్టిగా అడిగింది. చాలామంది కంగుతిన్నారు. కొంతమంది ముఖం ఎర్రబడింది. చాలామంది డబ్బులు లేవన్నారు. కొంతమంది ఇవ్వమని కరాఖండిగా చెప్పారు. మరికొంతమంది ఫ్రెండ్‌షిప్‌ వాపస్‌ ఇచ్చేసి పరిగెత్తబోయారు.

ఫ్రెండ్‌షిప్‌ డే సందర్భంగా గత ఆదివారం ఢిల్లీలో ముగ్గురు నెటిజన్లు ఇలా జనాల్ని కాసేపు ఆటపట్టించి..  ఆ సరదా వీడియోను యూట్యూబ్‌లో పెట్టారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement