breaking news
friendship day video
-
Viral Video: గుండెను తడిమే దృశ్యాలు!
-
వైరల్ వీడియో.. గుండెను తడిమే దృశ్యాలు!
స్నేహానికి కన్నా మిన్న లోకాన లేదన్నారు. చెలిమిని వర్ణించడానికి ఈ ఒక్క మాట చాలు. నా అన్నవాళ్లు ఎవరున్నా లేకపోయినా మంచి మిత్రుడు తోడుంటే జీవితాంతం భరోసాగా బతికేయొచ్చు. స్నేహం విలువను చాటి చెప్పడానికి ఆగస్టు నెలలో మొదటి ఆదివారం స్నేహితుల దినోత్సవం కూడా జరుపుకుంటున్నాం. స్మార్ట్ ఫోన్లు, సామాజిక మాధ్యమాలు అందుబాటులోకి వచ్చాక ఫ్రెండ్షిప్ డే’ లాంటి ప్రత్యేకమైన రోజుల్లో శుభాకాంక్షలు వెల్లువలా వచ్చి పడుతున్నాయి. ఇక ఫొటోలు, వీడియోలకైతే లెక్కేలేదు. అయితే అక్కడక్కడా గుండెను తడిమే హృద్యమైన దృశ్యాలు మన కంటబడుతున్నాయి. తాజాగా ప్రముఖ వ్యాపారవేత్త హర్ష్ గోయెంకా ట్విటర్లో షేర్ చేసిన వీడియో హృదయానికి హత్తుకుంటోంది. (క్లిక్: వందేళ్ల క్రితం చనిపోయిన చిన్నారి... ఇంకా ఇప్పటికీ చెక్కుచెదరకుండా..) విశ్వాసానికి మారుపేరుగా నిలిచే శునకాలు.. వెల్లువలా వచ్చి ఓ మహిళను అప్యాయంగా ముద్దాతున్న దృశ్యాలు వీక్షకులను తన్మయత్వానికి గురిచేస్తున్నాయి. తనపై ఎంతో ప్రేమ చూపిస్తున్న మూగజీవాలను ఆమె గుండెలకు హత్తుకోవడం చూస్తుంటే.. హృదయం పులకిస్తుంది. ఆమె ఎవరు.. ఎక్కడ, ఎపుడు జరిగిందనే వివరాలతో సంబంధం లేకుండా అలౌకిక భావనలోకి వెళ్లిపోతాం. మనం ఏది ఇస్తే అదే తిరుగొస్తుందనడానికి ఇంత కంటే నిదర్శనం కావాలా! ఈ వీడియోను మీరూ చూడండి. -
అందమైన అమ్మాయి.. ఫ్రెండ్‌గా ఉండమంటే!
ఒక అందమైన అమ్మాయి ఎదురుపడి.. 'నాకు స్నేహితులెవరూ లేరు. మీరు నా ఫ్రెండ్‌గా ఉంటారా?' అని అడిగితే ఎవరు మాత్రం ఒప్పుకోరు. ఎగిరి గంతేసి ఓకే చెప్తారు కదా? అదే జరిగింది గత ఆదివారం న్యూఢిల్లీలో.. ఓ అందమైన అమ్మాయి ఇలా చాలామందిని 'తన ఫ్రెండ్‌గా' ఉండమని కోరింది. చాలామంది హ్యాపీగా ఒప్పుకొన్నారు కూడా.. మరీ ఆదివారం ఫ్రెండ్షిప్ డే కదా.. అందుకే ఆమె వారికి ఫ్రెండ్షిప్ బ్యాండ్ కట్టింది. ఈ బ్యాండ్ కట్టిన తర్వాత ఆ బ్యూటీ ట్విస్టు ఇచ్చింది. 'ఫ్రెండ్షిప్ ఫ్రీ కానీ.. బ్యాండ్ ఫ్రీ కాదు.. కాబట్టి రూ. 40 కట్టండి' అంటూ గట్టిగా అడిగింది. చాలామంది కంగుతిన్నారు. కొంతమంది ముఖం ఎర్రబడింది. చాలామంది డబ్బులు లేవన్నారు. కొంతమంది ఇవ్వమని కరాఖండిగా చెప్పారు. మరికొంతమంది ఫ్రెండ్షిప్ వాపస్ ఇచ్చేసి పరిగెత్తబోయారు. ఫ్రెండ్షిప్ డే సందర్భంగా గత ఆదివారం ఢిల్లీలో ముగ్గురు నెటిజన్లు ఇలా జనాల్ని కాసేపు ఆటపట్టించి.. ఆ సరదా వీడియోను యూట్యూబ్‌లో పెట్టారు.