ఈ పిల్లి ఇంటర్నెట్‌లో చిన్నపాటి సెలబ్రిటీ | This cat minor celebrity in the Internet | Sakshi
Sakshi News home page

ఈ పిల్లి ఇంటర్నెట్‌లో చిన్నపాటి సెలబ్రిటీ

Dec 2 2015 12:45 AM | Updated on Sep 3 2017 1:19 PM

ఈ పిల్లి ఇంటర్నెట్‌లో చిన్నపాటి సెలబ్రిటీ

ఈ పిల్లి ఇంటర్నెట్‌లో చిన్నపాటి సెలబ్రిటీ

దీని పేరు ముని.. ప్రస్తుతం ఈ పిల్లి ఇంటర్నెట్‌లో చిన్నపాటి సెలబ్రిటీ అయి కూర్చుంది. ఏంటి విశేషం అని అనుకుంటున్నారా..

దీని పేరు ముని.. ప్రస్తుతం ఈ పిల్లి ఇంటర్నెట్‌లో చిన్నపాటి సెలబ్రిటీ అయి కూర్చుంది. ఏంటి విశేషం అని అనుకుంటున్నారా.. ఓసారి దాని కళ్లవైపు లుక్కేయండి..  మెల్లకన్ను.. ఈ మెల్లకన్నే ఈ మార్జాలానికి  పాపులారిటీని తెచ్చిపెట్టింది. అర్మేనియాకు చెందిన అనిహోవ్‌సెపియన్ దీని యజమాని. రోడ్లపై తిరుగాడుతూ ఉన్న మునిని ఇంటికి తెచ్చి.. అనిహోవ్‌సెపియన్  పెంచుకున్నారు. మెల్లకన్ను వల్లే దీన్ని ఎవరూ పెంచుకోకుండా రోడ్డుపై వదిలేసి ఉంటారని చెబుతున్నారు. ఈ మధ్య ముని ఫొటోలను దాని యజమాని ఇంటర్నెట్‌లో పెట్టారు. అంతే.. విపరీతమైన లైకులు, కామెంట్లు. ఒక్కసారిగా సెలబ్రిటీ అయిపోయింది.

అయితే.. మెల్లకన్ను ఒక విధంగా దీనికి అదృష్టం తెచ్చిపెడితే.. మరోవిధంగా దురదృష్టంగానూ మారిందట. పిల్లులు చేయాల్సిన మెయిన్ పని దీనికి రాదట. అదేనండి ఎలుకలు పట్టడం.. మెల్లకన్ను ఎఫెక్ట్‌కి ఎలుక సరిగ్గా ఎక్కడుందో తెలియక ముని తెగ తికమకపడిపోతుందట.

Advertisement
 
Advertisement
Advertisement