చోరీ... రెండో‘సారీ’ | thef second time theft same house | Sakshi
Sakshi News home page

చోరీ... రెండో‘సారీ’

Nov 27 2015 3:49 AM | Updated on Sep 3 2017 1:04 PM

చోరీ చేసిన ఇంట్లో సారీ అంటూ దొంగ రాసిన దృశ్యం

చోరీ చేసిన ఇంట్లో సారీ అంటూ దొంగ రాసిన దృశ్యం

ఒకసారి దొంగతనం చేసిన ఇంటికే మళ్లీ కన్నం వేశాడో దొంగ. అందుకు ‘సారీ’ అంటూ గోడపై పశ్చాత్తాపం వ్యక్తం చేసి...

* ఒకే ఇంట్లో మళ్లీ దొంగతనం
* క్షమించమని రాసి ఊడ్చుకెళ్లిన దొంగ

హైదరాబాద్: ఒకసారి దొంగతనం చేసిన ఇంటికే మళ్లీ కన్నం వేశాడో దొంగ. అందుకు ‘సారీ’ అంటూ గోడపై పశ్చాత్తాపం వ్యక్తం చేసి... ఇంట్లో ఉన్నదంతా ఊడ్చుకెళ్లాడు. బంజారాహిల్స్ రోడ్ నం. 14లోని బీఎన్‌రెడ్డి కాలనీ ప్లాట్ నెం.36లో వ్యాపారి ప్రదీప్ రంగనాథన్ దంపతులు ఉంటున్నారు. గతనెల 31న వీరింట్లో దొంగ జొరబడి... బీరువాలో ఉన్న అమెరికన్ డాలర్లు, బంగారు ఆభరణాలు, కెమెరాలు, ఐఫోన్లు దోచుకెళ్లాడు.

గోడపై ‘సారీ’ అంటూ రాసి ఉడాయించాడు. బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలోనే... బుధవారం రాత్రి దొంగ మళ్లీ అదే ఇంట్లోకి ప్రవేశించాడు. విలువైన ఆభరణాలతో పాటు రూ.6 వేల నగదు ఎత్తుకెళ్లాడు. సరిగ్గా మొదటిసారి రాసిన చోటే మరోసారి ‘సారీ’ అంటూ రాసి పరారయ్యాడు. బాధితుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన క్రైమ్ పోలీసులు, క్లూస్ టీం సంఘటనా స్థలంలో వేలిముద్రలను సరిచూడగా రెండుసార్లు వచ్చిందీ ఒకే దొంగని తేలింది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement