‘పంజాబీలు సింగ్ నే కోరుకుంటున్నారు’ | The Ambition Punjab Needs a Singh: Amarinder Singh | Sakshi
Sakshi News home page

‘పంజాబీలు సింగ్ నే కోరుకుంటున్నారు’

Jan 29 2017 8:59 AM | Updated on Aug 14 2018 9:04 PM

‘పంజాబీలు సింగ్ నే కోరుకుంటున్నారు’ - Sakshi

‘పంజాబీలు సింగ్ నే కోరుకుంటున్నారు’

పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీదే విజయమని కాంగ్రెస్ ముఖ్యమంత్రి అభ్యర్థి అమరీందర్ సింగ్ దీమా వ్యక్తం చేశారు.

చండీగఢ్‌: పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీదే విజయమని కాంగ్రెస్ ముఖ్యమంత్రి అభ్యర్థి అమరీందర్ సింగ్ దీమా వ్యక్తం చేశారు. ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ఆశలు ఫలించవని చెప్పారు. బాదల్ ప్రభుత్వం రాష్టాన్ని సర్వనాశసనం చేసిందని ధ్వజమెత్తారు.

‘ప్రభుత్వ వ్యతిరేకత తమకు కలిసొస్తుందని కేజ్రీవాల్ భావిస్తున్నారు. అలా జరగదు. ఎందుకంటే పంజాబీలు సింగ్ నే కోరుకుంటున్నారు. అకాలీల దుష్ప్రరిపాలన కారణంగా రాష్ట్రంలో అవినీతి పెరిగింది. పారిశ్రామిక ప్రగతి కుంటుపడింది. రైతులు ఆత్మహత్యలు పెరిగాయి. రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు.  రాష్ట్రంపై సీఎం బాదల్ సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నారు. మేము అధికారంలో వస్తే నాలుగు వారాల్లో డ్రగ్స్ మాఫియా పనిపడతాం. ఇదంతా ఎవరు నడిపిస్తున్నారో మాకు తెలుసు’ అని అమరీందర్ సింగ్ అన్నారు. ఒకవేళ ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోతే అని ప్రశ్నించగా.. గెలవని ఎన్నికల్లో తానెప్పుడూ పోటీ చేయలేదని సమాధానమిచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement