
‘నీకోసం.. టెర్రరిస్టు కూడా అవుతా’!
వరుస విజయాలతో ఊపుమీదున్న మెగా హీరో సాయిధరమ్ తేజ్ తాజాగా తన ‘తిక్క’ చూపేందుకు సిద్ధమవుతున్నాడు.
వరుస విజయాలతో ఊపుమీదున్న మెగా హీరో సాయిధరమ్ తేజ్ తాజాగా తన ‘తిక్క’ చూపేందుకు సిద్ధమవుతున్నాడు. సునీల్‌రెడ్డి దర్శకత్వంలో సాయి హీరోగా తెరకెక్కిన ఈ సినిమా టీజర్ గురువారం విడుదలైంది. ఈ సినిమాలో సాయి సరసన లారిస్సా బొన్సి, మన్నారా చోప్రా కథానాయికలుగా నటించారు.
‘జగమే మాయ.. బ్రతుకే మాయ’ అనే పాటతో ప్రారంభమైన ఈ టీజర్.. తాగుబోతు రమేష్ డైలాగులు క్యాచీగా ఉన్నాయి. ఇక సాయి ‘ఒక్క మాట అడిగి చూడు.. నీకోసం హీరో ఏంటి? నిజంగా టెర్రరిస్టు కూడా అయిపోతా’ అంటూ పంచ్ డైలాగులు పేల్చాడు. శ్రీ వెంకటేశ్వర మూవీ మేకర్స్ పతాకంపై డాక్టర్ సి.రోహణ్‌రెడ్డి నిర్మించిన ఈ చిత్రానికి తమన్ సంగీతం అందించాడు. అన్నట్టు ‘తిక్క’ టైటిల్ సాంగ్‌ను తమిళ నటుడు ధనుష్ పాడిన సంగతి తెలిసిందే.