జేపీ చొక్కా పట్టుకున్న తెలంగాణ లాయర్లు | Telangana Lawyers gherav Jayaprakash Narayana | Sakshi
Sakshi News home page

జేపీ చొక్కా పట్టుకున్న తెలంగాణ లాయర్లు

Feb 11 2014 4:33 PM | Updated on Mar 28 2019 5:23 PM

జేపీ చొక్కా పట్టుకున్న తెలంగాణ లాయర్లు - Sakshi

జేపీ చొక్కా పట్టుకున్న తెలంగాణ లాయర్లు

లోక్సత్తా నాయకుడు జయప్రకాష్ నారాయణకు ఢిల్లీలో తెలంగాణ సెగ తగిలింది. ఏపీ భవన్ వద్ద ఆయనను తెలంగాణ వాదులు అడ్డుకున్నారు.

న్యూఢిల్లీ: లోక్సత్తా నాయకుడు జయప్రకాష్ నారాయణకు ఢిల్లీలో తెలంగాణ సెగ తగిలింది. ఏపీ భవన్ వద్ద ఆయనను తెలంగాణ వాదులు అడ్డుకున్నారు.  విలేకరుల సమావేశంలో మాట్లాడుతుండగా ఆయన ప్రసంగాన్ని తెలంగాణ న్యాయవాదులు, విద్యార్థులు అడ్డుకున్నారు. జై తెలంగాణ, జేపీ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు.

జేపీ చొక్కా పట్టుకుని లాగేందుకు ప్రయత్నించారు. వెంటనే స్పందించిన పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. తెలంగాణవాదుల ఆందోళన మధ్య జేపీని పోలీసులు అక్కడిని నుంచి ఏపీ భవన్లోపలికి తీసుకెళ్లారు. ఈ ఉదయం నుంచి ఏపీ భవన్ లో తెలంగాణ వాదుల ఆందోళన కొనసాగుతోంది.

Advertisement
 
Advertisement
Advertisement