బెంగళూరులో ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ భార్యను హత్య చేసి, తానూ భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.
బెంగళూరులో ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ భార్యను హత్య చేసి, తానూ భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. జీపీ నగర్లో ఈ విషాదకర సంఘటన జరినట్టు డీసీపీ రేవణ్ణ తెలిపారు. మధుసూదన్, ఆయన భార్య ఇద్దరూ సాఫ్ట్వేర్ ఉద్యోగులు. శుక్రవారం రాత్రి వీరిద్దరూ ఘర్షణ పడ్డారు. సహనం కోల్పోయిన మధు తన భార్య శరీరమంతటా కత్తితో విచక్షణ రహితంగా పొడిచాడు.
భార్యను చంపిన తర్వాత మధు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మొదట సీలింగ్ ఫ్యాన్కు ఉరి వేసుకునేందుకు ప్రయత్నించగా అది ఊడిపడింది. అనంతరం కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకునేందుకు ప్రయత్నించగా అగ్గి పెట్టె దొరకలేదు. చివరకు తాము నివాసముంటున్న భవంతిలో 13వ అంతస్తు నుంచి కిందకు దూకి చనిపోయాడు. ఈ సంఘటన జరిగిన సమయంలో వారి ఆరేళ్ల కుమార్తె అక్కడికి సమీపంలోని తాతయ్య ఇంట్లో ఉన్నట్టు పోలీసులు తెలిపారు.