టీసీఎస్ విలువ రూ. 4 లక్షల కోట్లు | TCS market value crosses Rs 4 lakh crore; stock at all-time high | Sakshi
Sakshi News home page

టీసీఎస్ విలువ రూ. 4 లక్షల కోట్లు

Sep 3 2013 2:04 AM | Updated on Sep 1 2017 10:22 PM

ఐటీ సేవల దిగ్గజం టీసీఎస్ షేరు సోమవారం కొత్త రికార్డు నెలకొల్పింది. బీఎస్‌ఈలో 1.2% లాభపడటం ద్వారా చరిత్రాత్మక గరిష్టం రూ. 2,048 వద్ద ముగిసింది.

 ముంబై: ఐటీ సేవల దిగ్గజం టీసీఎస్ షేరు సోమవారం కొత్త రికార్డు నెలకొల్పింది. బీఎస్‌ఈలో 1.2% లాభపడటం ద్వారా చరిత్రాత్మక గరిష్టం రూ. 2,048 వద్ద ముగిసింది. దీంతో కంపెనీ మార్కెట్ విలువ(క్యాపిటలైజేషన్) తొలిసారి రూ. 4 లక్షల కోట్లను అధిగమించింది. ఒక దేశీయ కంపెనీ ఈ స్థాయి మార్కెట్ విలువను సాధించడం ఇది రెండోసారి మాత్రమే. ఇంతక్రితం అంటే 2007 అక్టోబర్‌లో ముకేశ్ అంబానీ గ్రూప్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్‌ఐఎల్) మాత్రమే ఈ ఫీట్‌ను సాధించింది. కాగా, సోమవారం ట్రేడింగ్ ముగిసేసరికి టీసీఎస్ మార్కెట్ క్యాప్ రూ. 4,00,868 కోట్లకు చేరగా, ఆర్‌ఐఎల్ విలువ రూ. 2.85 లక్షల కోట్లుగా నమోదైంది.

Advertisement
 
Advertisement
Advertisement