సేవల పన్ను ఎగ్గొడితే కఠిన చర్యలు: చిదంబరం | Tax evaders can be traced, warns Chidambaram | Sakshi
Sakshi News home page

సేవల పన్ను ఎగ్గొడితే కఠిన చర్యలు: చిదంబరం

Nov 27 2013 1:24 AM | Updated on Sep 2 2017 1:00 AM

దేశంలో సేవల పన్ను ఎగ్గొట్టడానికి ప్రయత్నించే వారిపై కఠిన చర్యలు తప్పవని ఆర్థికమంత్రి పీ.చిదంబరం పేర్కొన్నారు.

కోల్‌కతా: దేశంలో సేవల పన్ను ఎగ్గొట్టడానికి ప్రయత్నించే వారిపై కఠిన చర్యలు తప్పవని ఆర్థికమంత్రి పీ.చిదంబరం పేర్కొన్నారు. ఇక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో మంగళవారం ఆయన మాట్లాడుతూ, ఈ తరహా ఎగవేతదారులను అరెస్ట్‌చేయడమే కాకుండా, కఠినశిక్ష విధించడానికి ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుంటుందని స్పష్టం చేశారు. మొత్తం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో 55 శాతం వాటా కలిగిన సేవల నుంచి రంగం ఆశించిన స్థాయిలో పన్నుల పరిమాణం లేదని ఆర్థికశాఖ వర్గాలు భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. పన్నులు ఎగ్గొట్టేవారిని గుర్తించడానికి తగిన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవడం జరుగుతుందని చిదంబరం తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement