లైంగిక వేధింపుల కేసులో కెప్టెన్ టి.వి ఎడిటర్ అరెస్ట్ | Tamil Nadu Police arrests Editor of Captain TV on sexual harassment charges | Sakshi
Sakshi News home page

లైంగిక వేధింపుల కేసులో కెప్టెన్ టి.వి ఎడిటర్ అరెస్ట్

Dec 22 2013 10:52 AM | Updated on Jul 23 2018 9:13 PM

లైంగిక వేధింపుల కేసులో కెప్టెన్ టి.వి ఎడిటర్ అరెస్ట్ - Sakshi

లైంగిక వేధింపుల కేసులో కెప్టెన్ టి.వి ఎడిటర్ అరెస్ట్

మహిళ జర్నలిస్ట్పై లైంగిక వేధింపుల ఆరోపణలపై తెహల్కా ఎడిటర్ అరుణ్ తేజ్పాల్ అరెస్ట్ ఘటన స్మృతి పథంలో నుంచి చెరిగి పోక ముందే మరో ఘటన తమిళనాడులో చోటు చేసుకుంది.

మహిళ జర్నలిస్ట్పై లైంగిక వేధింపుల ఆరోపణలపై తెహల్కా ఎడిటర్ అరుణ్ తేజ్పాల్ అరెస్ట్ ఘటన స్మృతి పథంలో నుంచి చెరిగి పోక ముందే మరో ఘటన తమిళనాడులో చోటు చేసుకుంది. చెన్నైకు చెందిన కెప్టెన్ టీవీ ఎడిటర్ దినేష్ తనపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆ సంస్థలో విధులు నిర్వర్తించిన మాజీ మహిళ జర్నలిస్ట్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

 

ఈ నేపథ్యంలో కెప్టెన్ టీవీ ఎడిటర్ దినేష్ ను ఆదివారం చెన్నైలో  తమిళనాడు పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే మాజీ ఉద్యోగి అయిన మహిళ జర్నలిస్ట్ ఆరోపణలను కెప్టెన్ టీవీ సంస్థ తీవ్రంగా ఖండించింది. ఆ మహిళ ఆరోపణ సత్య దూరమైనవని పేర్కొంది. కెప్టెన్ టీవి ప్రముఖ తమిళ నటుడు విజయకాంత్కు సారథ్యంలో నడుస్తోంది. ఆయన స్థాపించిన డీఎండీకే పార్టీ అధికార చానల్గా కెప్టెన్ టీవీ పని చేస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement