నేరం - మతం - పచ్చి అవకాశవాదం | Take action on Criminals without considering the religions: Nirmala sitaraman | Sakshi
Sakshi News home page

నేరం - మతం - పచ్చి అవకాశవాదం

Jan 12 2014 4:33 PM | Updated on Oct 17 2018 5:55 PM

నేరం - మతం - పచ్చి అవకాశవాదం - Sakshi

నేరం - మతం - పచ్చి అవకాశవాదం

మైనార్టీల కేసుల ఎత్తివేతపై కమిటీ ఏర్పాటు చేస్తామనడం పచ్చి రాజకీయ అవకాశవాదం అని బీజేపీ అధికార ప్రతినిధి నిర్మలా సీతారామన్‌ అన్నారు.

ఢిల్లీ: మైనార్టీల కేసుల ఎత్తివేతపై కమిటీ ఏర్పాటు చేస్తామనడం పచ్చి రాజకీయ అవకాశవాదం అని  బీజేపీ అధికార ప్రతినిధి నిర్మలా సీతారామన్‌ అన్నారు. నేరస్తుల పట్ల మతాలకు అతీతంగా వ్యవహరించాలని ఆమె డిమాండ్ చేశారు. పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లు ఎప్పుడు పెడతారో చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ బిల్లుకు బేషరతుగా బీజేపీ మద్దతు తెలుపుతుందని చెప్పారు.

తిరుమలలో సామాన్య భక్తులకు శఠగోపం పెడుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. టీటీడీ సిబ్బంది వీఐపీల సేవలో మునిగితేలుతున్నారని విమర్శించారు. సామాన్యులకు గోవింద దర్శనం కల్పించాలని ఆమె డిమాండ్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement