రాష్ట్ర విభజన బిల్లును అసెంబ్లీలో చర్చించాకే రాష్ట్రపతి వద్దకు వస్తుందని ఏఐసీసీ అధికార ప్రతినిధి సందీప్ దీక్షిత్ తెలిపారు.
న్యూఢిల్లీ:రాష్ట్ర విభజన బిల్లును అసెంబ్లీలో చర్చించాకే రాష్ట్రపతి వద్దకు వస్తుందని ఏఐసీసీ అధికార ప్రతినిధి సందీప్ దీక్షిత్ తెలిపారు. తెలంగాణ బిల్లు అంశంపై శుక్రవారం మీడియాతో మాట్లాడిన ఆయన అసెంబ్లీలో చర్చించిన తరువాత రాష్ట్రపతికి చేరుతుందన్నారు. తెలంగాణ ఏర్పాటుపై సీడబ్యూసీలో నిర్ణయం చేశామన్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. రాష్ట్ర విభజన పై కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నిర్ణయంలో ఎటువంటి మార్పు ఉండదన్నారు. విభజన బిల్లు రాష్ట్రపతి అభిప్రాయం తరువాత పార్లమెంట్లో ప్రవేశపెడతామన్నారు.