డిప్యూటీ సీఎం దంపతులకు స్వైన్‌ ఫ్లూ | swine flu to telangana deputy cm | Sakshi
Sakshi News home page

డిప్యూటీ సీఎం దంపతులకు స్వైన్‌ ఫ్లూ

Jan 28 2017 9:20 AM | Updated on Sep 5 2017 2:21 AM

డిప్యూటీ సీఎం దంపతులకు స్వైన్‌ ఫ్లూ

డిప్యూటీ సీఎం దంపతులకు స్వైన్‌ ఫ్లూ

తెలుగు రాష్ట్రాల్లో స్వైన్‌ఫ్లూ వ్యాధి కలకలం రేపుతోంది..

తెలుగు రాష్ట్రాల్లో విజృంభిస్తున్న మహమ్మారి

హైదరాబాద్‌: తెలుగు రాష్ట్రాల్లో స్వైన్‌ఫ్లూ వ్యాధి కలకలం రేపుతోంది. ఇప్పటివరకు ఒక్క తెలంగాణలోనే 100మందికి స్వైన్‌ఫ్లూ సోకినట్టు తెలుస్తోంది. తెలంగాణ డిప్యూటీ సీఎం మహమూద్‌ అలీ సైతం స్వైన్‌ఫ్లూతో బాధపడుతున్నారు. మహమూద్‌ అలీ దంపతులిద్దరికీ స్వైన్‌ఫ్లూ సోకినట్టు తెలుస్తోంది.

హైదరాబాద్‌, కర్నూలు, నెల్లూరు, తిరుపతిలో స్వైన్‌ఫ్లూ కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటివరకు గాంధీ ఆస్పత్రిలో ఆరుగురు ఈ వ్యాధి వల్ల మృతిచెందిరు. మరో 12 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ వ్యాధి ఇంతగా విజృంభిస్తున్నా.. ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం.. సరైన అవగాహన, నివారణ చర్యలు తీసుకోకపోవడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  
 

Advertisement
 
Advertisement
Advertisement