సుజుకి యాక్సెస్... లిమిటెడ్ ఎడిషన్ | Suzuki Motorcycle ties up with Salman Khan's Being Human Foundation | Sakshi
Sakshi News home page

సుజుకి యాక్సెస్... లిమిటెడ్ ఎడిషన్

Oct 3 2013 2:02 AM | Updated on Sep 1 2017 11:17 PM

సుజుకి యాక్సెస్... లిమిటెడ్ ఎడిషన్

సుజుకి యాక్సెస్... లిమిటెడ్ ఎడిషన్

సుజుకి మోటార్‌సైకిల్స్ యాక్సెస్ స్కూటర్ మోడల్‌లో స్పెషల్ ఎడిషన్‌ను మార్కెట్లోకి తెస్తోంది.

ముంబై: సుజుకి మోటార్‌సైకిల్స్ యాక్సెస్ స్కూటర్ మోడల్‌లో స్పెషల్ ఎడిషన్‌ను మార్కెట్లోకి తెస్తోంది. ఈ స్కూటర్ ఆవిష్కరణ సందర్భంగా బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్‌కు చెందిన బీయింగ్ హ్యూమన్ ఫౌండేషన్‌తో ఒప్పందం కుదుర్చుకున్నామని  సుజుకి మోటార్‌సైకిల్స్ ఎగ్జిక్యూటివ్ వైస్-ప్రెసిడెంట్ అతుల్ గుప్తా చెప్పారు. ఈ స్కూటర్ ధరను రూ.58,978గా నిర్ణయించామని పేర్కొన్నారు. ఇప్పటికే తమ బ్రాండ్ అంబాసిడర్‌గా సల్మాన్ ఖాన్ వ్యవహరిస్తున్నారని, తాజా ఒప్పందం దీనికి కొనసాగింపని చెప్పారు. ఒప్పందంలో భాగంగా బీయింగ్ హ్యూమన్ దుస్తులు, వస్తువులను సుజుకి డీలర్లు విక్రయిస్తారని తెలిపారు.  వీటి విక్రయాల ద్వారా వచ్చిన సొమ్మును ధార్మిక కార్యక్రమాలకు వినియోగిస్తామన్నారు. సుజుకి భాగస్వామ్యంతో బీయింగ్ హ్యూమ న్ ఫౌండేషన్ కార్యక్రమాలు మరింత విస్తృత మవుతాయని సల్మాన్ ఖాన్ పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement