ఆధార్‌పై ఎంపీల మౌనమెందుకు?: సుప్రీం | Sakshi
Sakshi News home page

ఆధార్‌పై ఎంపీల మౌనమెందుకు?: సుప్రీం

Published Thu, Apr 27 2017 8:27 AM

ఆధార్‌పై ఎంపీల మౌనమెందుకు?: సుప్రీం - Sakshi

న్యూఢిల్లీ: పాన్‌ (శాశ్వత ఖాతా సంఖ్య) కార్డు పొందటానికి ఆధార్‌ను తప్పనిసరిచేయడం పట్ల ఎంపీలు ఎందుకు అభ్యంతరం వ్యక్తం చేయలేదని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ‘లోక్‌సభలో కూర్చున్న 542 మంది ఈ నిర్ణయంపై అభ్యంతరం చెప్పనపుడు మేమెందుకు కల్పించుకోవాలి?’ అని జస్టిస్‌ ఏకే సిక్రి, జస్టిస్‌ అశోక్‌ భూషణ్‌లతో కూడిన ధర్మాసనం బుధవారం నిలదీసింది.

ఆధార్‌ను తప్పనిసరి చేయబోమని గతంలోనే కేంద్రం చేసిన ప్రకటనను బెంచ్‌ దృష్టికి తీసుకురాగా, కేంద్రం తన నిర్ణయానికి కట్టుబడి ఉండాలని లేదని, ఏదైనా చట్టం చేసే విషయంలో తాము పార్లమెంట్‌ను అడ్డుకోమని పేర్కొంది. ఐటీచట్టంలోని సెక్షన్‌ 139ఏఏ చెల్లుబాటును సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్లను విచారించింది.

Advertisement

తప్పక చదవండి

Advertisement