సిరియాలో ఆత్మాహుతి దాడి; 32 మంది మృతి | Suicide attacks kill dozens in Syrian city of Homs | Sakshi
Sakshi News home page

సిరియాలో ఆత్మాహుతి దాడి; 32 మంది మృతి

Feb 25 2017 3:48 PM | Updated on Nov 6 2018 7:53 PM

సిరియాలో ఆత్మాహుతి దాడి; 32 మంది మృతి - Sakshi

సిరియాలో ఆత్మాహుతి దాడి; 32 మంది మృతి

సిరియాలోని హామ్స్ నగరం బాంబు దాడులతో దద్దరిల్లింది.

హామ్స్: సిరియాలోని హామ్స్ నగరం బాంబు దాడులతో దద్దరిల్లింది. భద్రత స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఆరుగురు ఆత్మాహతి దళ సభ్యులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో కనీసం 32 మంది మరణించగా, మరో 24 మంది గాయపడ్డారు. హామ్స్ మిలటరీ ఇంటలిజెన్స్ చీఫ్‌ జనరల్ హాసన్ దాబౌల్ మరణించినట్టు సిరియా న్యూస్ ఛానెల్ వెల్లడించింది.

ఆత్మాహుతి దళ సభ్యులు ముగ్గురు చొప్పున రెండు బృందాలుగా ఏర్పడి హామ్స్ నగరంలో దాడి చేశారు. భద్రత దళాలకు, ఉగ్రవాదుల మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి. ఈ దాడికి పాల్పడింది ఎవరన్నది ఇంకా ప్రకటించలేదు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సివుంది.

Advertisement
 
Advertisement
Advertisement