breaking news
Homs city
-
చేజారిన మరో నగరం
బీరూట్: బషర్ అల్ అస్సాద్ సారథ్యంలోని సిరియా ప్రభుత్వం మరో వైఫల్యాన్ని ఎదుర్కొంది. ప్రభుత్వ సేనలతో మూడు రోజుల తరబడి పోరాడిన సిరియా తిరుగుబాటుదారులు ఎట్టకేలకు హమా నగరాన్ని ఆక్రమించుకున్నారు. దీంతో విస్తీర్ణంపరంగా దేశంలో నాలుగో అతిపెద్ద నగరమైన హమా ఇప్పుడు తిరుగుబాటుదారుల వశమైంది. హమా నగరంలోని పోలీసు కమాండ్ ప్రధాన కార్యాలయం, ఒక వైమానిక స్థావరం, కేంద్ర కారాగారంపై తిరుగుబాటుదారులు పట్టుసాధించారు. జైళ్లో ఉన్న వందల మంది తోటి తిరుగుబాటుదారులు, ఖైదీలను బయటకు వదిలేశారు. తిరుగుబాటుదారులు నగరం మధ్యలోకి వచ్చేయడంతో ఘర్షణలతో అమాయక పౌరులు ప్రాణాలు కోల్పోవడం ఇష్టంలేక తాము నగరాన్ని వదిలేసి వచి్చనట్లు సైన్యం గురువారం ప్రకటించింది. దేశంలోనే మూడో అతిపెద్ద నగరమైన హోమ్స్ సిటీపై ఇప్పుడు తిరుగుబాటుదారులు గురిపెట్టారు. ఆక్రమించిన హమాకు ఈ నగరం కేవలం 40 కిలోమీటర్ల దూరంలో ఉంది. ‘‘దేశ రాజధాని డమాస్కస్‌కు సింహద్వారంగా హోమ్స్ సిటీకి పేరుంది. డమాస్కస్ నుంచి పాలన సాగిస్తున్న అస్సాద్‌కు ఇది మింగుడుపడని వ్యవహారమే. ఎందుకంటే హమాపై పట్టు కోల్పోయారంటే అస్సాద్ త్వరలో దేశంపైనా పట్టుకోల్పోతారని అర్థం’’అని బ్రిటన్ కేంద్రంగా పనిచేస్తున్న సిరియా మానవహక్కుల సంస్థ ‘వార్ మానిటర్’చీఫ్ రమీ అబ్దుర్రహమాన్ వ్యాఖ్యానించారు. ‘‘మేం హమాను గెలిచాం’’అని బుధవారం అలెప్పో సిటీలో స్వేచ్ఛగా తిరుగుతూ తిరుగుబాటు సంస్థ హయత్ తహ్రీర్ అల్ షామ్ నేత అల్గోలానీ ఒక వీడియో సందేశం ఇచ్చారు. ఆక్రమణలతో తిరుగుబాటుదారులు మున్ముందుకు రాకుండా రోజుల తరబడి నిలువరిస్తూ ఎంతో మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. 2011 మార్చిలో అస్సాద్ పాలనకు వ్యతిరేకంగా మొదలైన ఉద్యమం.. చివరకు తుర్కియే దన్నుతో తిరుగుబాటుదారులు, జిహాద్ ఉగ్రవాదులు, సిరియా వ్యతిరేక శక్తుల సమూహంగా కొత్త రూపం సంతరించుకుని ఇటీవలి కాలంలో ఉధృతమైంది. ప్రస్తుతం అస్సాద్ ప్రభుత్వపాలనానీడలో కేవలం కొన్ని నగరాలు మాత్రమే మిగిలి ఉన్నాయి. మిగతా ప్రాంతాలను ఒక్కొక్కటిగా తిరుగుబాటుదారులు ఆక్రమించుకుంటూ వస్తున్నారు. గతంలో అస్సాద్‌కు పూర్తి అండదండలు అందించిన రష్యా, ఇరాన్‌లు ఇప్పుడు సొంత యుద్ధాల్లో బిజీగా ఉన్నాయి. మిత్ర దేశం సిరియాకు సైనిక, ఆర్థిక సాయం చేసేంత తీరిక వాటికి లేదు. ఉక్రెయిన్‌తో రష్యా, ఇజ్రాయెల్‌తో ఇరాన్ యుద్ధంలో మునిగిపోవడం తెల్సిందే. దీనిని అవకాశంగా తీసుకుని ఇటీవలి కొద్దినెలలుగా తిరుగుబాటుదారులు తమ ఆక్రమణలకు వేగం పెంచారు. తిరుగుబాటుదారులు బుధవారం ఆక్రమించిన హమా పేరు మూడు దశాబ్దాల క్రితం ప్రపంచవ్యాప్తంగా వార్తల్లోకెక్కింది. 1982 ఊచకోత ఈ నగరంలోనే జరిగింది. అస్సాద్ తండ్రి హఫీజ్ కర్కశ ఏలుబడిలో ప్రభుత్వం ఇస్లామిక్ ఉద్యమాన్ని ఉక్కుపాదంతో అణచివేసింది. ఆనాటి ఊచకోతలో వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. -
సిరియాలో భీకర డ్రోన్ దాడి
బీరుట్: పదమూడేళ్లుగా అంతర్యుద్దంతో సతమతమవుతోన్న సిరియాలో భీకర డ్రోన్ దాడి సంభవించింది. హొమ్స్ నగరంలో గురువారం మిలటరీ జవాన్ల స్నాతకోత్సవ కార్యక్రమం లక్ష్యంగా జరిగిన దాడిలో పౌరులు, సైనికులు కలిపి 100 మందికి పైగా చనిపోగా మరో 125 మంది గాయపడ్డారు. సిరియాలో ఇటీవలి సంవత్సరాల్లో జరిగిన దాడుల్లో ఇదే తీవ్రమైందని చెబుతున్నారు. ఘటన నేపథ్యంలో ప్రభుత్వం మూడు రోజులు సంతాప దినాలుగా ప్రకటించింది. ‘మాకు తెలిసిన అంతర్జాతీయ బలగాల మద్దతు ఉన్న తిరుగుబాటుదారులే పేలుడు పదార్థాలు కలిగిన డ్రోన్లతో దాడికి పాల్పడ్డారు’అని సిరియా సైన్యం ఆరోపించింది. ఘటనకు తామే కారణమంటూ ఎవరూ ప్రకటించుకోలేదు. Drone attack killed over 100 in a graduation ceremony at Syrian Military Academy, Syria. Several Syrian regime generals and officers who attended the ceremony are killed or injured. Middle East is heating up. https://t.co/p099AtAdu1 pic.twitter.com/NK2xAWCaqo — Shadow of Ezra (@ShadowofEzra) October 5, 2023 -
సిరియాలో ఆత్మాహుతి దాడి; 32 మంది మృతి
హామ్స్: సిరియాలోని హామ్స్ నగరం బాంబు దాడులతో దద్దరిల్లింది. భద్రత స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఆరుగురు ఆత్మాహతి దళ సభ్యులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో కనీసం 32 మంది మరణించగా, మరో 24 మంది గాయపడ్డారు. హామ్స్ మిలటరీ ఇంటలిజెన్స్ చీఫ్ జనరల్ హాసన్ దాబౌల్ మరణించినట్టు సిరియా న్యూస్ ఛానెల్ వెల్లడించింది. ఆత్మాహుతి దళ సభ్యులు ముగ్గురు చొప్పున రెండు బృందాలుగా ఏర్పడి హామ్స్ నగరంలో దాడి చేశారు. భద్రత దళాలకు, ఉగ్రవాదుల మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి. ఈ దాడికి పాల్పడింది ఎవరన్నది ఇంకా ప్రకటించలేదు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సివుంది.