
చదువుకోవాలంటే పడవ ఎక్కాల్సిందే..
ఆదిలాబాద్ జిల్లా వేమనపల్లి మండలంలోని నీల్వాయి గ్రామానికి చెందిన కొందరు గొర్లపల్లిలోని ఓ ప్రైవేటు పాఠశాలలో చదువుతున్నారు.
వేమనపల్లి : ఆదిలాబాద్ జిల్లా వేమనపల్లి మండలంలోని నీల్వాయి గ్రామానికి చెందిన కొందరు గొర్లపల్లిలోని ఓ ప్రైవేటు పాఠశాలలో చదువుతున్నారు. అయితే.. ఐదు రోజులుగా నీల్వాయి వాగులో నీటి ప్రవాహం ఎక్కువగా ఉండడంతో ఉపాధ్యాయులు, విద్యార్థులు ఇలా పడవను ఆశ్రయిస్తున్నారు. నీల్వాయికి కూతవేటు దూరంలోనే గొర్లపల్లి ఉంటుంది.
కానీ.. మార్గమధ్యలో వాగు ఉంది. ఏటా వర్షాకాలం వచ్చిందంటే మండల వాసులకు ఈ కష్టాలు తప్పవు. శనివారం కూడా సుమారు 28 మంది చిన్నారులు ప్రమాదకరంగా పడవలో ప్రయాణం సాగించారు.