ప్రియురాలి పాస్ వర్డ్ దొంగిలించి.. ఫొటోలు పోస్ట్ | Student held for posting obscene pictures of ex-girlfriend | Sakshi
Sakshi News home page

ప్రియురాలి పాస్ వర్డ్ దొంగిలించి.. ఫొటోలు పోస్ట్

Sep 13 2015 11:31 AM | Updated on Sep 18 2018 8:19 PM

ప్రియురాలి పాస్ వర్డ్ దొంగిలించి.. ఫొటోలు పోస్ట్ - Sakshi

ప్రియురాలి పాస్ వర్డ్ దొంగిలించి.. ఫొటోలు పోస్ట్

ప్రియురాలి పాస్ వర్డ్ దొంగిలించి మరీ ఓ యువకుడు అంతకుముందు తాము అభ్యంతరకర పరిస్థితుల మధ్య దిగిన ఫొటోలు సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలో పెట్టి పోలీసుల చేతికి దొరికిపోయాడు.

కోయంబత్తూర్: పలు సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలో తన ప్రేయసికి చెందిన అభ్యంతర కర ఫొటోలు పోస్టు చేసిన యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన కోయంబత్తూరులో చోటుచేసుకుంది. నగరంలోని ఓ ప్రైవేటు కాలేజీలో చదువుతున్న గౌతం అనే 19 ఏళ్ల యువకుడు ఓ అమ్మాయిని ప్రేమించాడు. ఆమెతో పలు ప్రాంతాల్లో తిరిగాడు. అలా తిరగే క్రమంలో వారిద్దరూ కలిసి చాలా ఫొటోలు దిగారు. ఇటీవల ఆమెను లక్ష రూపాయలు ఇవ్వాలని లేదంటే వారిద్దరు అభ్యంతరకర పరిస్థితుల మధ్య దిగిన ఫొటోలు పోస్ట్ చేస్తానని బెదరించాడు.

కానీ, ఆ యువతి పట్టించుకోకపోవడంతో.. ఆమెను భయపెట్టడం కోసం ఓ ఫొటోను ఆయా సామాజిక అనుసంధాన వేధికల్లో పోస్ట్ చేశాడు. దీంతో సదరు యువతి సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతడిని అదుపులోకి తీసుకున్నారు. అయితే, విద్యా జీవితం చెడిపోతుందని పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చి వదిలేశారు. కానీ, తీరు మార్చుకొని గౌతమ్ మరోసారి అలాంటి ఫొటోలు పోస్ట్ చేశాడు. అది కూడా.. ప్రియురాలి పాస్ వర్డ్ దొంగిలించి మరీ ఈ పోస్ట్ చేశాడు. దీంతో తిరిగి అతడిని అరెస్టు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement