‘ఏదోక రోజు ఆమె నా సొంతమవుతుంది​’ | SRK’s Darr inspired him to be a scary lover | Sakshi
Sakshi News home page

‘ఏదోక రోజు ఆమె నా సొంతమవుతుంది​’

May 13 2017 1:20 PM | Updated on Sep 5 2017 11:05 AM

‘ఏదోక రోజు ఆమె నా సొంతమవుతుంది​’

‘ఏదోక రోజు ఆమె నా సొంతమవుతుంది​’

తాను ప్రేమించిన యువతి భర్తను హత్య చేయడానికి ప్రయత్నించిన వ్యక్తిని శుక్రవారం ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

న్యూఢిల్లీ: షారుక్‌ ఖాన్‌ నటించిన ‘డర్‌’ సినిమాను స్పూర్తిగా తీసుకుని తాను ప్రేమించిన యువతి భర్తను హత్య చేయడానికి ప్రయత్నించిన వ్యక్తిని శుక్రవారం ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బుద్ధవిహార్‌ లోని రోహిణి ప్రాంతానికి చెందిన వివేక్‌ కుమార్‌ అగర్వాల్‌(37) గత నెల 20న ద్విచక్రవాహనంపై ప్రయాణిస్తున్న పియూష్‌ మాలిక్‌(28)పై కాల్పులు జరిపాడు. ప్రాథమిక విచారణలో ఏ కారణం లేకుండా కాల్పులు జరిపాడని భావించారు. అయితే శుక్రవారం అగర్వాల్‌ని అదుపులోకి తీసుకుని విచారిస్తే ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

ఫిబ్రవరి 4న మాలిక్‌ని చంపేందుకు ప్రయత్నించి విఫలమయ్యాడు. రెండు వారాల క్రితం మరోసారి హత్యాయత్నం చేయడంతో మాలిక్ పోలీసులను ఆశ్రయించాడు. నాలుగు రోజుల క్రితం పోలీసులు కుమార్‌ను పట్టుకునేందుకు ప్రయత్నించగా నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేశాడు. అగర్వాల్‌ 2013లో రియల్‌ ఎస్టేట్‌ ఏజెంట్‌గా పనిచేస్తుండేవాడు. అదే సమయంలో అతను మాలిక్‌ భార్యను చూశాడు. ఆమె కూడా రియల్‌ ఎస్టేట్‌ రంగంలోనే పనిచేసేది. అనంతరం అతను ఆమెను ప్రేమించినట్లు, పెళ్లి చేసుకున్నట్లు కలలు కనేవాడు. ఆమె ఫోన్‌ నంబర్‌ సంపాదించి ఫోన్లు, మెసేజులు చేసేవాడని విచారణలో తేలింది.

‘డర్‌’ సినిమాలో షారుక్‌ స్పూర్తితో తాను ఈ  హత్యాయత్నం చేశానని నిందితుడు విచారణలో వెల్లడించాడు. గత డిసెంబర్‌లో వాళ్ల వివాహం అయినప్పట్నుంచే అగర్వాల్‌.. మాలిక్‌పై కక్ష పెంచుకున్నాడు. ‘నేను బతకాలనుకోవడం లేదు. ఆమె లేకుండా జీవించలేను. ఏదోక రోజు ఆమె నాదవుతుంద’ని పోలీసులతో కుమార్‌ చెప్పడం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement