-
‘మేరా ఫౌజీ అమర్ రహే’.. పెళ్లినాటి దుస్తుల్లో భర్తకు తుది వీడ్కోలు
సిమ్లా: తమిళనాడులో జరిగిన ఆర్మీ హెలికాప్టర్లో 13 మంది వీర మరణం పొందిన విషయం తెలిసిందే. సీడీఎస్ బిపిన్ రావత్, ఆయన భార్య మధులికతోపాటు 11 మంది జవాన్లు మృత్యువాత పడ్డారు. ప్రమాద సమయంలో హెలికాప్టర్లో 14 మంది ఉండగా.. వీరిలో గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. తీవ్రంగా గాయపడిన ఆయనకు బెంగళూరులోని ఆర్మీ కమాండ్ హాస్పిటల్లో వైద్యం అందిస్తున్నారు. కాగా ప్రమాదంలో మృతిచెందిన లాన్స్ నాయక్ వివేక్ కుమార్ అంత్యక్రియలు హిమాచల్ ప్రదేశ్‌లోని కాంగ్రా జిల్లాలో సైనిక, ప్రభుత్వ లాంఛనాలతో శనివారం మధ్యాహ్నం నిర్వహించారు. అతని తమ్ముడు సుమిత్ కుమార్ చితికి నిప్పంటించాడు. ఈ కార్యక్రమంలో వివేక్ కుమా ర్‌భార్య ప్రియాంక పెళ్లి నాటి చీరను కట్టుకొని తన భర్తకు తుది వీడ్కోలు పలికారు. శ్మశాన వాటిక వద్ద ‘మేరా ఫౌజీ అమర్ రహే’ అంటూ మూడు సార్లు నినాదం చేసింది. అందరి ముందే కన్నీళ్లతో భర్తకు వీడ్కోలు పలకడం పలువురిని కలచివేసింది. చదవండి: ఆ కుటుంబానికి కోటి ఎక్స్‌గ్రేషియా.. ప్రభుత్వ ఉద్యోగం: సీఎం అనంతరం వివేక్‌కుమార్ భార్య ప్రియాంక మాట్లాడుతూ.. తన భర్తను చూసి చాలా గర్వపడుతున్నానని తెలిపింది. తమ ఆరునెలల బిడ్డ భవిష్కత్తు కోసం వివేక్ ఎన్నో కలలు కన్నాడని. ఆ కోరికలన్నీ నెరవేరుస్తాను ధీమా వ్యక్తం చేసింది. అయితే తమ కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉపాధి కల్పించాలని వివేక్ తల్లి ప్రభుత్వాన్ని అభ్యర్థించింది. ఇక అంతకముందు ముఖ్యమంత్రి జైరామ్ ఠాగూర్ గగ్గల్ విమానాశ్రయంలో మృతదేహానికి నివాళులు అర్పించారు. మృతుడి కుటుంబానికి తక్షణ సాయంగా రాష్ట్ర ప్రభుత్వం రూ. 5 లక్షలు అందించినట్లు ఠాకూర్ తెలిపారు. చదవండి: విషాదం: గతంలో కోవిడ్.. తాజాగా డెంగ్యూ.. బీజేపీ మహిళా ఎమ్మెల్యే మృతి -
‘ఏదోక రోజు ఆమె నా సొంతమవుతుంది’
న్యూఢిల్లీ: షారుక్ ఖాన్ నటించిన ‘డర్’ సినిమాను స్పూర్తిగా తీసుకుని తాను ప్రేమించిన యువతి భర్తను హత్య చేయడానికి ప్రయత్నించిన వ్యక్తిని శుక్రవారం ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బుద్ధవిహార్ లోని రోహిణి ప్రాంతానికి చెందిన వివేక్ కుమార్ అగర్వాల్(37) గత నెల 20న ద్విచక్రవాహనంపై ప్రయాణిస్తున్న పియూష్ మాలిక్(28)పై కాల్పులు జరిపాడు. ప్రాథమిక విచారణలో ఏ కారణం లేకుండా కాల్పులు జరిపాడని భావించారు. అయితే శుక్రవారం అగర్వాల్‌ని అదుపులోకి తీసుకుని విచారిస్తే ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఫిబ్రవరి 4న మాలిక్‌ని చంపేందుకు ప్రయత్నించి విఫలమయ్యాడు. రెండు వారాల క్రితం మరోసారి హత్యాయత్నం చేయడంతో మాలిక్ పోలీసులను ఆశ్రయించాడు. నాలుగు రోజుల క్రితం పోలీసులు కుమార్‌ను పట్టుకునేందుకు ప్రయత్నించగా నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేశాడు. అగర్వాల్ 2013లో రియల్ ఎస్టేట్ ఏజెంట్‌గా పనిచేస్తుండేవాడు. అదే సమయంలో అతను మాలిక్ భార్యను చూశాడు. ఆమె కూడా రియల్ ఎస్టేట్ రంగంలోనే పనిచేసేది. అనంతరం అతను ఆమెను ప్రేమించినట్లు, పెళ్లి చేసుకున్నట్లు కలలు కనేవాడు. ఆమె ఫోన్ నంబర్ సంపాదించి ఫోన్లు, మెసేజులు చేసేవాడని విచారణలో తేలింది. ‘డర్’ సినిమాలో షారుక్ స్పూర్తితో తాను ఈ హత్యాయత్నం చేశానని నిందితుడు విచారణలో వెల్లడించాడు. గత డిసెంబర్లో వాళ్ల వివాహం అయినప్పట్నుంచే అగర్వాల్.. మాలిక్‌పై కక్ష పెంచుకున్నాడు. ‘నేను బతకాలనుకోవడం లేదు. ఆమె లేకుండా జీవించలేను. ఏదోక రోజు ఆమె నాదవుతుంద’ని పోలీసులతో కుమార్ చెప్పడం గమనార్హం.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పేమెంట్స్ బ్యాంకులకు ఉజ్వల భవిష్యత్తు!
మేఘాలయలో హిట్లర్‌ను అరెస్టు చేసిన కెన్నెడీ?
మీ ఆశీర్వాదంతో విజయం సాధిస్తాం
పేదింట విషాదం
నూకాంబిక అమ్మవారి బాలాలయానికి పోటెత్తిన భక్తులు
రమేష్ రౌడీయిజంతో జల్లా ప్రజల్లో భయభ్రాంతులు
ఎన్. గజపతినగరంలో టీడీపీకి గట్టి షాక్
ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా ట్రాఫిక్ మళ్లింపు
జగన్ మళ్లీ సీఎం కావడం తథ్యం
‘చేనేత’ను ఆదుకున్నది జగన్ ప్రభుత్వమే
తప్పక చదవండి
- ట్రాక్టర్ అదుపు తప్పి..కాలువలోకి దూసుకెళ్లి..
- Today Telugu Horoscope: ఈ రాశివారికి పేరుప్రతిష్ఠలు పెరుగుతాయి
- గుండె ఘోష విన్నారు..
- ఏ1 చంద్రబాబు, ఏ2 లోకేశ్
- నిప్పుతో చెలగాటమా!
- రవీంద్రజాలం... జడేజా ఆల్‌రౌండ్ షో
- మంచి మాట: నోరు మంచిదైతే...
- జగన్ మళ్లీ ఎందుకు గెలుస్తారంటే...
- ఇలాగేనా మాట్లాడేది?
- జ్వరంతో బాధపడుతున్నారు.. అయినా అదరగొట్టారు: రుతురాజ్
Advertisement