తన ప్రేమను తిరస్కరించినందుకు ఓ అమ్మాయి తల్లి తండ్రులపై ఓ యువకుడు దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన సంఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన తూర్పు ఢిల్లీలోని జ్యోతి నగర్ లో చోటు చేసుకుంది.
తన ప్రేమను తిరస్కరించినందుకు ఓ అమ్మాయి తల్లి తండ్రులపై ఓ యువకుడు దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన సంఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన తూర్పు ఢిల్లీలోని జ్యోతి నగర్ లో చోటు చేసుకుంది.
ప్రేమిస్తున్నానంటూ వెంటపడి చేసిన ప్రపోజ్ ను యువతి తిరస్కరించింది. దాంతో యువతి తల్లితండ్రులు యోగేష్ (55), పూనమ్ (50)లపై ఆదివారం ఉదయమే వారి నివాసానికి వచ్చి కర్రతో దాడి చేసినట్టు పోలీసులు తెలిపారు.
యోగేష్ పెద్ద కూతురుతో నిందితుడు తన ప్రేమను వ్యక్తం పరిచాడని.. అందుకు ఒప్పుకోకపోవడంతో యువతి తల్లితండ్రలుపై దాడి చేశాడని పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడు పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు.