పెళ్లికి సిద్ధంగా ఉన్నా: నటి | soon will get married, says actress Shriya saran | Sakshi
Sakshi News home page

పెళ్లికి సిద్ధంగా ఉన్నా: నటి

Aug 30 2017 7:04 PM | Updated on Sep 17 2017 6:09 PM

పెళ్లికి సిద్ధంగా ఉన్నా: నటి

పెళ్లికి సిద్ధంగా ఉన్నా: నటి

పంతొమ్మిదేళ్ల వయసులోనే ‘ఇష్టం’ సినిమాతో హీరోయిన్‌గా వెండితెరకు పరిచయమైన శ్రియా శరణ్‌.. మరికొద్ది రోజుల్లో 35వ పడిలోకి..

చెన్నై: పంతొమ్మిదేళ్ల వయసులోనే ‘ఇష్టం’ సినిమాతో హీరోయిన్‌గా వెండితెరకు పరిచయమైన శ్రియా శరణ్‌.. మరికొద్ది రోజుల్లో 35వ పడిలోకి అడుగుపెట్టనున్నారు. తన 16 ఏళ్ల సినీ కెరీర్‌లో ఎన్నో ఉత్థానపతనాలు చవిచూసిన ఆమె.. తాజాగా బాలకృష్ణ సరసన ‘పైసా వసూల్‌’ లో నటించారు. కాగా, తాను త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్లు ఆమె చెప్పుకొచ్చారు.

తెలుగులో ‘ఇష్టం’, తమిళంలో ‘ఎనక్కు 20 ఉనక్కు18’ లతో ఎంట్రీ ఇంచ్చి, అనతి కాలంలోనే స్టార్‌ డైరెక్టర్‌ శంకర్‌ రూపొందించిన ‘శివాజీ’లో సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌తో జత కట్టే లక్కీఛాన్స్‌ దక్కించుకున్నారు శ్రియా. తెలుగులోనూ చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేశ్‌, మహేశ్‌బాబు, ప్రభాస్‌, రవితేజ, ఎన్టీఆర్‌ లాంటి స్టార్‌లు అందరితోనూ తెరపంచుకున్నారు. అటు బాలీవుడ్‌లోనూ అప్పుడప్పుడూ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. కెరీర్‌ మొత్తంలో మర్చిపోలేని అనుభవం ఏదైనా ఉందంటే.. సూపర్‌స్టార్‌ రజనీతో కలిసి నటించడమేనని శ్రియా అన్నారు.  

‘‘చాలా మంది పెళ్లి ఎప్పుడు? అని అడుగుతుంటారు. అవును.. పెళ్లికి సిద్ధంగా ఉన్నా. నచ్చినవాడు తారాసపడిన వెంటనే వివాహం చేసుకుంటా. స్త్రీ జీవితంలో పెళ్లి, పిల్లలు చాలా ముఖ్యం కదా. నాకు కాబోయే భర్త మంచి స్నేహితుడై ఉండాలి’’ అని శ్రియా చెప్పారు.

రహస్యం ఇదే: అందంలోని రహస్యం ఏమిటని అడుగుతుంటారనీ, తన అందానికి ప్రధాన కారణం యోగానేననీ చెప్పింది. యోగా తన జీవితంలో చాలా మార్చు తీసుకొచ్చిందనీ, ఉద్రేకాలను అదుపు చేసుకోవడానికి యోగా ఎంతగానో ద్రోహదపడుతుందని తెలిపారు.

డ్రగ్స్‌పై: ఈ తరం యువత మాదక ద్రవ్యాల బారిన పడి జీవితాలను నాశనం చేసుకోవడం బాధగా ఉందనీ, ఎలాంటి చెడు అలవాట్లకు అలవాటు పడకుండా యువత చక్కగా చదువుపైనే దృష్టి సారించాలని శ్రియ హితవు పలికారు. కుటుంబంలో ఒక్కరు డ్రగ్స్‌కు అలవాటు పడితే ఆ కుటుంబం అంతా బాధింపుకు గురౌతుందన్నది తెలుసుకోవాలని ఆమె పేర్కొన్నారు.

ఐ లవ్‌ ఇట్‌: ఇండస్ట్రీలోకి వచ్చి ఎంతోకాలమైనా తానిప్పటికీ నటనను ప్రేమిస్తున్నాననీ, వృత్తిని గౌరవించేవాళ్లకు అది ఎప్పటికీ బోర్‌ కొట్టదని శ్రియ అన్నారు. తానిక్కడ ఒంటరిగానే జయించానని, ఏనాడూ చేదు అనుభవాలు చవిచూడలేదని, నటిగా నిలదొక్కుకోవడంలో సహ నటీనటులు, దర్శక నిర్మాతలు సహకరించారని చెప్పుకొచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement