త్వరలో 7 వేల ఖాళీల భర్తీ | Soon 7 thousand vacancies replacement | Sakshi
Sakshi News home page

త్వరలో 7 వేల ఖాళీల భర్తీ

Aug 13 2015 2:19 AM | Updated on Sep 3 2017 7:19 AM

రాష్ట్ర హోం శాఖలో 14 వేల ఖాళీలున్నాయని, త్వరలో 7 వేల పోస్టులను భర్తీ చేయనున్నట్లు ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప చెప్పారు.

హోంశాఖలో 14 వేల ఖాళీలున్నాయి: చినరాజప్ప
సాక్షి, విజయవాడ బ్యూరో: రాష్ట్ర హోం శాఖలో 14 వేల ఖాళీలున్నాయని, త్వరలో 7 వేల పోస్టులను భర్తీ చేయనున్నట్లు ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప చెప్పారు. ఆయన బుధవారం విజయవాడలోని సీఎం క్యాంపు కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఖాళీల భర్తీ ఫైలు ముఖ్యమంత్రి వద్ద ఉందని, త్వరలో దానికి ఆమోదం లభిస్తుం దని తెలిపారు. హోంగార్డులకు జీతాలు పెంచే విషయాన్ని పరిశీలిస్తున్నామన్నారు. వర్సిటీల్లో ర్యాగింగ్‌ను తీవ్రంగా పరిగణిస్తున్నామన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement