పోలవరం ప్రాజెక్టు విషయమై బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. పోలవరం అథారిటీకి రాష్ట్ర ప్రభుత్వం లెక్కలు చెప్పడం లేదని తెలిపారు.
ఢిల్లీ: పోలవరం ప్రాజెక్టు విషయమై బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. పోలవరం అథారిటీకి రాష్ట్ర ప్రభుత్వం లెక్కలు చెప్పడం లేదని తెలిపారు. ఏపీ బీజేపీ నేతలు గురువారం ఢిల్లీ పార్టీ అధ్యక్షుడు అమిత్షాను కలిశారు.
అనంతరం సోమువీర్రాజు విలేకరులతో మాట్లాడుతూ ప్రత్యేక హోదాపై ఇచ్చినమాటను నిలబెట్టుకుంటామని తెలిపారు. ప్రత్యేక హోదాపై నిర్ణయం ఆలస్యంతో ఏపీకి నష్టమేమీ జరుగదని పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టులో పట్టిసీమ అంతర్భాగమని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. వెనుకబడిన జిల్లాలకు నిధులిస్తున్నా ఏపీ ప్రభుత్వం ఖర్చు చేయడం లేదని చెప్పారు. కేంద్ర నిధులను బ్యాంకుల్లో పెట్టుకొని వడ్డీలు తింటున్నారని విమర్శించారు. పట్టిసీమ నుంచి రాయలసీమకు ఒక్క చుక్కనీరు ఇవ్వడం లేదని తెలిపారు. ప్రజలందర్నీ ఏపీ సర్కార్ గందరగోళంలో పడేస్తోందని అన్నారు.