‘స్మార్ట్’గా మధుమేహాన్ని కనిపెట్టొచ్చు | Smart as diabetes recognize | Sakshi
Sakshi News home page

‘స్మార్ట్’గా మధుమేహాన్ని కనిపెట్టొచ్చు

Nov 1 2015 10:05 PM | Updated on Apr 4 2019 3:20 PM

‘స్మార్ట్’గా మధుమేహాన్ని కనిపెట్టొచ్చు - Sakshi

‘స్మార్ట్’గా మధుమేహాన్ని కనిపెట్టొచ్చు

మధుమేహాన్ని తెలుసుకునేందుకు శరీరాన్ని సూదులతో గుచ్చే పద్ధతులకు అమెరికా శాస్త్రవేత్తలు మంగళం పాడనున్నారు.

 వాషింగ్టన్: మధుమేహాన్ని తెలుసుకునేందుకు శరీరాన్ని సూదులతో గుచ్చే పద్ధతులకు అమెరికా శాస్త్రవేత్తలు మంగళం పాడనున్నారు. ప్రస్తుతం ట్రెండ్ సృష్టిస్తున్న స్మార్ట్ ఫోన్‌లతోనే శరీరంలో ‘చక్కెర’ శాతం ఎంతుందో తెలుసుకునేలా ఓ కొత్త పరికరాన్ని కనిపెట్టారు. ఆ నూతన పరికరాన్ని స్మార్ట్ ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసి, లాలాజలం ద్వారా టైప్ 2 షుగర్‌ను కూడా సెకన్లలో కనిపెట్టేయొచ్చు. దీనిపై టెక్ డీ మాంటేర్రెయ్ సంస్థకు చెందిన ప్రాజెక్టు కో అర్డినేటర్ డా.మర్‌కో ఆంటోనియో రిటే పాలోమర్స్(మెక్సికన్ యూనివర్సిటీ) మాట్లాడుతూ.. లాలాజల నమూనాను సెల్‌ఫోన్ కెమెరాతో రికార్డ్ చేయడం ద్వారా షుగర్‌ను కనిపెట్టొచ్చన్నారు. అపారప్రతిభ కలిగిన టెక్ డీ మాంటేర్రెయ్ బృందం, హౌస్టన్ యూనివర్సిటీలు సంయుక్తంగా ఈ ఆవిష్కరణను చేశాయని వివరించారు. కెమెరాతో రికార్డ్ చేయడం ద్వారా ఎప్పటికప్పుడు షుగర్ టెస్ట్ చేసుకోవచ్చని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement