మాహిష్మతిని వీడిన శివగామి ఇలా.. | Sivagami Turns ‘Mathangi’; Ramya Krishna's new movie Traile | Sakshi
Sakshi News home page

మాహిష్మతిని వీడిన శివగామి ఇలా..

May 14 2017 12:18 PM | Updated on Sep 5 2017 11:09 AM

మాహిష్మతిని వీడిన శివగామి ఇలా..

మాహిష్మతిని వీడిన శివగామి ఇలా..

చిన్నారి మహేంద్ర బాహుబలిని కాపాడే క్రమంలో మాహిష్మతిని వీడిన శివగామి.. నదిలోనే ప్రాణాలు కోల్పోయిందా? లేక తిరిగొస్తుందా?

చిన్నారి మహేంద్ర బాహుబలిని కాపాడే క్రమంలో మాహిష్మతిని వీడిన శివగామి.. నదిలోనే ప్రాణాలు విడిచినట్లు సినిమాలో చూస్తాం. అయితే, నిజంగానే  శివగామి చనిపోతుందా? లేక తిరిగొస్తుందా? ట్విస్టులతో కూడిన రాజమౌళి సినిమాలు చూశాక ప్రేక్షకులకు ఇలాంటి సందేహాలురాక మానవు! సాక్ష్యం కావాలంటే రమ్యకృష్ణ కొత్త సినిమా ‘మాతంగి’ ట్రైలర్‌పై నెటిజన్ల కామెంట్లు చూడొచ్చు! ‘మాహిష్మతి నుంచి వెళ్లిపోయిన శివగామి.. మళ్లీ మాతంగిగా వచ్చింది..’ అని కొందరు, ‘ఆవిడ(రమ్య) ఏ పాత్రలోనైనా ఒదిగిపోగలర’ని ఇంకొందరు వ్యాఖ్యానించారు.

ఏది ఏమైనా ప్రేక్షకుల్లో బాహుబలి ఫీవర్‌ చల్లారకముందే.. రమ్యకృష్ణ నటించిన మరో సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. కూతురి సెంటిమెంట్‌తోపాటు క్షుద్రశక్తులతో పోరాటాన్ని ప్రధాన ఇతివృత్తంగా తెరకెక్కిన ‘మాతంగి’లో రమ్య లీడ్‌రోల్‌ పోశించింది. సీనియర్‌ నటుడు జయరాం హీరోగా, కన్నం తమరక్కుళం దర్శకత్వంలో మలయాళంలో రూపొందిన ఈ సినిమాలో మిర్చి సంపత్‌, అక్షర కిషోర్‌, ఏంజిలీనా అబ్రహామ్‌లతోపాటు దివంగత ఓమ్‌పురిలు ప్రధాన పాత్రల్లో కనిపిస్తారు. తెలుగు డబ్బింగ్‌కు వెన్నలకంటి మాటలు రాశారు. జూన్‌లో విడుదలకానున్న ‘మాతంగి’ ట్రైలర్‌ శనివారం విడుదలైంది..

Advertisement
 
Advertisement
Advertisement