షాక్‌ అయ్యా..అవసరమైతే అవయవదానం చేస్తా.. | Shocked to see Vinod sahab’s latest picture, says Irrfan Khan | Sakshi
Sakshi News home page

షాక్‌ అయ్యా..అవసరమైతే అవయవదానం చేస్తా..

Apr 7 2017 9:19 AM | Updated on Sep 5 2017 8:11 AM

షాక్‌ అయ్యా..అవసరమైతే అవయవదానం చేస్తా..

షాక్‌ అయ్యా..అవసరమైతే అవయవదానం చేస్తా..

బాలీవుడ్‌ సీనియర్‌ నటుడు వినోద్‌ ఖన్నా ఆరోగ్య పరిస్థితులపై మరో బాలీవుడ్‌ నటుడు ఇర్ఫాన్‌ ఖాన్‌ స్పందించారు.

ముంబై:  బాలీవుడ్‌ సీనియర్‌ నటుడు వినోద్‌ ఖన్నా ఆరోగ్య పరిస్థితులపై మరో బాలీవుడ్‌ నటుడు ఇర్ఫాన్‌ ఖాన్‌ స్పందించారు. సామాజిక మీడియాలో వినోద్‌ ఖన్నాకు తీవ్ర అనారోగ్యంపై ఆయన తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం  చేశారు. వినోద్ ఖన్నాఆరోగ్యానికి సంబంధించిన సోషల్‌ మీడియాలో  వైరల్‌ అయిన ఫోటోపై ఆయన  ఆశ్యర్యాన్ని వ్యక్తం చేశారు.

తన రాబోయే చిత్రం 'హిందీ మీడియం', ట్రైలర్ విడుదల  సందర్భంగా   గురువారం ఇర్ఫాన్ మీడియాతో మాట్లాడారు.  హిందీ చిత్ర పరిశ్రమలో  ధర్మేంద్ర , వినోద్‌ అత్యంత అందమైన నటులని,  అలాంటిది  వినోద్‌  సాబ్‌ ఫోటో చూసినపుడు  చాలా షాక్‌గు గురయ్యానంటూ ఆందోళన వ్యక్తం చేశారు.  కావాలంటే ఆయనకోసం అవయవ దానం చేయడానికి కూడా తాను సిద్ధంగా ఉన్నానని  చెప్పారు.   వినోద్  ఖన్నాజీ అనారోగ్యం పట్ల తాను బాగా  కలత చెందానన్నారు.   ఆయన తర్వగా కోలుకోవాలని ఆ  దేవుణ్ణి ప్రార్థిస్తున్నాన్నారు.  

అటు  త్వరగా కోలుకోవాలంటూ విషెస్‌ చెప్పిన  అభిమానులకు ధన్యవాదాలు తెలిపిన ఖన్నా కుటుంబం తమ  ప్రైవసీని  గౌరవించాలని వేడుకున్నారు.

కాగా వినోద్‌ ఖన్నా అనారోగ్యంపై సోషల్‌ మీడియాలో పలు  పుకార్లు  చెలరేగాయి. అయితే  తీవ్రమైన డీహైడ్రేషన్‌తో ఆసుపత్రిలో చేరారని సర్ హెచ్‌ఎన్‌  రిలయన్స్ ఫౌండేషన్ ఆస్పత్రి వర్గాలు శుక్రవారం ప్రకటించాయి. చికిత్స కు వినోద్‌ ఖన్నా సానుకూలంగా స్పందిస్తున్నారని ప్రస్తుతం పరిస్థితి  నిలకడగా ఉందని  వెల్లడించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement