హొం మంత్రి షిండేకు శశిథరూర్‌ లేఖ | Shashi Tharoor letter to sushil kumar shinde | Sakshi
Sakshi News home page

హొం మంత్రి షిండేకు శశిథరూర్‌ లేఖ

Jan 19 2014 3:39 PM | Updated on Sep 2 2017 2:47 AM

శశి థరూర్

శశి థరూర్

తన భార్య సునంద పుష్కర్ మృతిపై దర్యాప్తు చేయాలని కేంద్ర మంత్రి శశిథరూర్ హోంమంత్రి సుశీల్ కుమార్ షిండేకు లేఖ రాశారు.

న్యూఢిల్లీ: తన భార్య సునంద పుష్కర్ మృతిపై దర్యాప్తు చేయాలని కేంద్ర మంత్రి శశిథరూర్  హోంమంత్రి సుశీల్ కుమార్ షిండేకు  లేఖ రాశారు.  దర్యాప్తు పూర్తిచేసి సునంద మృతిపై నిజాలు వెలికితీయాలని ఆయన ఆ లేఖలో కోరారు.

 శశిథరూర్ భార్య సునంద పుష్కర్ (52) ఈ నెల 17న ఢిల్లీలోని లీలా హోటల్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విషయం తెలిసిందే. 2010లో  శశి థరూర్  సునందను వివాహం చేసుకున్నారు. వారి  మధ్య  విభేదాలు తలెత్తినట్టు ఇటీవల ప్రచారం జరిగింది. సునంద మృతిపై అనేక అనుమానాలు తలెత్తాయి. ఆమె ఆత్మహత్య చేసుకుందా? లేక ఎవరైనా హత్య చేశారా? అనేది స్పష్టంగా తెలియలేదు. ఆమె మరణానికి కారణాలు తెలియకుండా అనేక అనుమానాలు వ్యక్తమవుతున్న నేపధ్యంలో శశిథరూర్  హొం మంత్రికి లేఖ రాశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement