శృంగారం.. దివ్యౌషధం! | sex like a tonic for life | Sakshi
Sakshi News home page

శృంగారం.. దివ్యౌషధం!

Feb 4 2014 11:52 PM | Updated on Apr 4 2019 3:20 PM

శృంగారం.. దివ్యౌషధం! - Sakshi

శృంగారం.. దివ్యౌషధం!

శృంగారంలో పాల్గొనడం చాలా సంతోషాన్ని, తృప్తిని ఇస్తుందని, ఆనందంతోపాటు కొంత ఆరోగ్యమూ దక్కుతుందన్నది తెలిసిందే.

లండన్: శృంగారంలో పాల్గొనడం చాలా సంతోషాన్ని, తృప్తిని ఇస్తుందని, ఆనందంతోపాటు కొంత ఆరోగ్యమూ దక్కుతుందన్నది తెలిసిందే. అయితే శృంగారం ఆరోగ్యకరమైన జీవితానికి దాదాపూ ఒక దివ్య ఔషధంలా పనిచేస్తుందని ఇటీవలి పలు పరిశోధనల్లో వెల్లడైంది. వీటి ప్రకారం శృంగారౌషధంతో అందే ప్రయోజనాలలో కొన్ని.. మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది. మైగ్రేన్ నొప్పి మాయం అవుతుంది. ప్రోస్టేట్ కేన్సర్ దరిచేరదు.

అరగంట శృంగారంతో సుమారుగా పురుషుల్లో 100 క్యాలరీలు, స్త్రీలలో 69 క్యాలరీలు ఖర్చవుతాయి. ఇది అరగంట ట్రెడ్‌మిల్‌పై పరుగెత్తినదానికి సమానం. జీవక్రియల తీవ్రత ఆరు రెట్లు పెరుగుతుంది. ఇది 20 నిమిషాలపాటు టెన్నిస్ ఆడటానికి లేదా 40 నిమిషాలు యోగా చేయడానికి సమానం. గుండె, ఊపిరితిత్తులు, ఇతర అవయవాలన్నింటికీ ఇదో మంచి కసరత్తు. అంతేకాదు.. జతకట్టిన తర్వాత కొన్ని ఎలుకల మెదడు కణాలు సైతం వృద్ధి అయినట్లు ఇటీవల అమెరికా శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement