'ఎన్కౌంటర్ కానేకాదు.. క్రూరమైన హత్య' | seshachalam incident is not an encounter, but brutal murder, says vaiko | Sakshi
Sakshi News home page

'ఎన్కౌంటర్ కానేకాదు.. క్రూరమైన హత్య'

Apr 10 2015 3:09 PM | Updated on Sep 3 2017 12:07 AM

'ఎన్కౌంటర్ కానేకాదు.. క్రూరమైన హత్య'

'ఎన్కౌంటర్ కానేకాదు.. క్రూరమైన హత్య'

చిత్తూరు కలెక్టరేట్ ముట్టడికి ప్రయత్నించిన ఎండీఎంకే అధినేత వైగో సహా 400 మంది అనుచరులను పోలీసులు అరెస్టు చేశారు.

చిత్తూరు కలెక్టరేట్ ముట్టడికి ప్రయత్నించిన ఎండీఎంకే అధినేత వైగో సహా 400 మంది అనుచరులను పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టు చేసి జైలుకు తరలించే సమయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ''ఇది క్రూరమైన హత్య. ఎన్ కౌంటర్ కానేకాదు. అత్యంత క్రూరంగా జరిగింది. చెట్లు కొట్టుకుంటున్న కూలీలను హతమార్చారు. వాళ్లను చిత్రహింసలు పెట్టారు.

ఆ తర్వాత అతి దగ్గర నుంచి కాల్చి చంపారు. వాళ్ల శరీరంపై ఉన్న గాయాలే అందుకు నిదర్శనం. ఇంతవరకు చరిత్రలో ఎప్పుడూ ఇలా జరగలేదు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో న్యాయమే గెలుస్తుందన్న విశ్వాసం ఉంది. తమిళనాడు ప్రభుత్వం కూడా ముందుకొచ్చి ఈ విషయంలో నిజానిజాలు తేల్చాల్సిన అవసరం ఉంది'' అని ఆయన చెప్పారు. ఈ సందర్భంగా తమిళనాడులో అన్ని ప్రాంతాల్లోను నిరసనలు జరుగుతున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement