ఉక్రెయిన్లో ఓ సైనిక రవాణా విమానాన్ని రష్యా అనుకూల వేర్పాటువాదులు కూల్చేశారు. దాంతో ఆ విమానంలో ఉన్న పలువురు మరణించారు.
ఉక్రెయిన్లో ఓ సైనిక రవాణా విమానాన్ని రష్యా అనుకూల వేర్పాటువాదులు కూల్చేశారు. దాంతో ఆ విమానంలో ఉన్న పలువురు మరణించారు. లుగాంస్క్ నగరం మీదుగా విమానం వెళ్తున్నప్పుడు ఈ సంఘటన జరిగింది. పెద్ద కాలిబర్ ఉన్న మిషన్గన్తో ఉగ్రవాదులు ఇష్టారాజ్యంగా కాల్పులు జరిపారని, దాంతో ఉక్రెయిన్ వైమానిక దళానికి చెందిన ఇల్యుషిన్-76 విమానం కూలిపోయిందని సైన్యం తెలిపింది.
నాలుగు ఇంజన్లున్న ఈ జెట్ విమానంలో సైనిక బలగాలతో పాటు యుద్ధ పరికరాలు కూడా ఉన్నాయి. మరణించిన సైనికుల కుటుంబాలకు ఉక్రెయిన్ రక్షణ మంత్రిత్వ శాఖ నివాళులు అర్పించింది. అయితే, ఎంతమంది మరణించారన్న విషయం మాత్రం చెప్పలేదు.