ఫ్లాట్ గా ముగిసిన మార్కెట్లు | Sensex Sheds Gains To Close Flat On Profit-Taking | Sakshi
Sakshi News home page

ఫ్లాట్ గా ముగిసిన మార్కెట్లు

Dec 28 2016 4:27 PM | Updated on Sep 4 2017 11:49 PM

దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్ గా ముగిశాయి.

ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు  ఫ్లాట్ గా ముగిశాయి.  సానుకూల ప్రపంచ మార్కెట్లు,  బడ్జెట్ అంచనాల నేపథ్యంలో లాభాలతో ప్రారంభమైనా  చివరికి  సెన్సెక్స్‌ 3 పాయింట్లు తగ్గి 26,211 వద్ద నిఫ్టీ 2 పాయింట్లు లాభపడి 8,035 వద్ద  ముగిశాయి.   మిడ్‌ సెషన్‌ లో కొంత మెరుగ్గా ఉన్నా చివర్లో అమ్మకాల వెల్లువతో  ఫ్లాట్ గా స్థిరపడింది.   లో లెవల్స్ లో కొనుగోళ్ళతో  గత రెండు రోజులుగా బలహీనపడ్డ రియల్టీ    ఈ రోజు పుంజుకుంది. మొదట లాభాలతో మురిపించిన ఫార్మా, ఎఫ్‌ఎంసీజీ ,పీఎస్‌యూ బ్యాంక్‌ సెక్టార్ స్వల్ప నష్టాలతో ముగిశాయి. ఇన్‌ఫ్రాటెల్‌, కోల్‌ ఇండియా, ఐడియా, ఇండస్‌ఇండ్, టెక్‌ మహీంద్రా, అరబిందో, జీ, బాష్‌, డాక్టర్‌ రెడ్డీస్‌, విప్రో  లాభాల్లోనూ,  టాటా మోటార్స్ డీవీఆర్‌‌, యస్‌బ్యాంక్‌, రిలయన్స్‌, హీరోమోటో, పవర్‌గ్రిడ్‌, అంబుజా, హిందాల్కో, టాటా స్టీల్‌, టీసీఎస్‌  నష్టాల్లోనూ ముగిశాయి.
అటు డాలర్ మారకపు విలువలో రూపాయి బాగా బలహీనపడింది. 11పైసల నష్టంతో రూ68.17 వద్ద ఉంది.  మరోవైపు బంగారం మాత్రం  సాంకేతికంగా కీలకమైన స్తాయికి పైన స్థిరంగా ఉంది. ఎంసీఎక్స్ మార్కెట్ లోపుత్తడి పది గ్రా.  రూ. 79 లాభపడి రూ. 27,249  వద్ద ఉంది.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement